రైట్‌.. రైట్‌...

ABN , First Publish Date - 2020-05-19T10:20:31+05:30 IST

కరోనా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో మంచి ర్యాల జిల్లాలో ఆరేంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌లోకి మార్చారు. సోమవారం ముఖ్యమంత్రి

రైట్‌.. రైట్‌...

నేటి నుంచి రోడ్డెక్కనున్న బస్సులు

డిపోలో 126 బస్సులు

గ్రీన్‌ జోన్‌లోకి జిల్లా


(ఆంధ్రజ్యోతి, మంచిర్యాల) :   కరోనా పాజిటివ్‌ కేసులు లేకపోవడంతో మంచి ర్యాల జిల్లాలో ఆరేంజ్‌ జోన్‌ నుంచి గ్రీన్‌జోన్‌లోకి మార్చారు. సోమవారం ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్‌ అనంతరం 59 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు మంగళవారం ఉదయం 6 గంటల నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆర్టీసీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు బస్సులను నడిపించేం దుకు సిద్ధం చేశారు. నిబంధనలకు అనుగుణంగా బస్సులో 28 మంది మాత్రమే ప్రయాణించే విధం గా ఏర్పాట్లు చేస్తున్నారు. డిపోలో మొత్తం 126 బస్సులు ఉన్నాయి.


అయితే ఏయే రూట్లలో నడి పించాలనేది డిపో మేనేజర్‌లకు సమాచారం అం దనుంది. ప్రయాణికులు మాస్క్‌ ధరిం చడంతోపా టు భౌతికదూరాన్ని పాటిస్తూ బస్సులను నడపాలని సూచించారు. బస్సులలో శానిటైజర్‌ కూడా అందుబాటులో ఉంచనున్నారు. బస్సులను నడిపిస్తుండడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  గ్రీన్‌ జోన్‌లోకి మారడంతో అన్ని దుకాణాలు తెరుచుకోనున్నాయి. ఆటోలు, ట్యాక్సీలు యథావిధిగా నడవనున్నాయి.

Updated Date - 2020-05-19T10:20:31+05:30 IST