Advertisement
Advertisement
Abn logo
Advertisement

వాగులో ఇరుక్కున్న బస్సు

ఆలూరు మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. మొలగవల్లి రైల్వే స్టేషన్‌ సమీపంలో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మొలగవల్లి రహదారిలో జొహరాపురం వాగు వద్ద ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుంది. బురద, వరద నీరు కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు దిగింది. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. గమనించిన జొహరాపురం గ్రామస్థులు బస్సును ఎక్స్‌కవేటర్‌ సాయంతో బయటకు తీశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


- ఆలూరు రూరల్‌

Advertisement
Advertisement