Abn logo
Apr 21 2021 @ 00:27AM

మండుతున్న ఎండలు.. పెరిగిన విద్యుత వినియోగం


జిల్లాలో భారీగా పెరిగిన విద్యుత వాడకం 

గత నెల 5వ తేదీన విద్యుత వినియోగం 17.497 మిలియన యూనిట్లు 

ప్రస్తుతం రోజూ 20 మిలియన యూనిట్లకు చేరుతున్న వినియోగం

నెల రోజుల్లో 2 నుంచి 3 మిలియన యూనిట్ల పెరుగుదల

కాలిపోతున్న ట్రాన్సఫార్మర్లు.. తరచూ విద్యుత అంతరాయాలు


అనంతపురం రూరల్‌, ఏప్రిల్‌ 20: రోజు రోజుకు ఎండలు పెరుగుతుండటం, ఉక్కపోతతో జిల్లా లో విద్యుత వినియోగం భారీగా పెరిగింది. గత నెల 5వ తేదీన 17.497 మిలియన యూనిట్ల విద్యుతను వాడారు. నెల రో జు ల తర్వాత ఆ వినియోగం మ రింత పెరిగింది.  గత నెల రోజులుగా 19 మిలియన యూనిట్ల నుంచి 20 మిలియన యూనిట్ల మధ్య విద్యుత వినియోగం జరిగింది. గత నెలరోజులుగా విద్యుత వినియోగం 2 నుంచి 3 మిలియన యూనిట్లు పెరిగింది. డి మాండ్‌ మేరకు విద్యుత సరఫరా ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ అంతరాయాలు కలగటం, లోఓల్టేజీ, ట్రా న్సఫార్మర్లు కాలిపోవడం జరుగుతున్నాయి. 


జిల్లాలో ఏటా పెరుగుతున్న విద్యుత వినియోగం

జిల్లాలో గృహాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమ లు, వ్యవసాయ కనెక్షన్లు ఏటా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గృహ, వాణిజ్య, వ్యవసాయంలో వివిధ కేటగిరిల్లో 14.22 లక్షల విద్యుత కనెక్షన్లు ఉన్నాయి.  ఈనేపథ్యంలో జిల్లాలో ఏడాదికేడాదికి వి ద్యుత వినియోగం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఎండలు, వడగాలులు పెరిగిన నేపథ్యంలో  ఇంట్లో, దు కాణాల్లో  ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు వాడకం బాగా పెరిగింది. దీంతో విద్యుత వినియోగం పెరిగిపోయింది. 


కాలిపోతున్న ట్రాన్సఫార్మర్లు..

విద్యుత వినియోగం అమాంతం పెరగటంతో సరఫరాలో వివిధ సమస్యలు తల్తెతున్నాయి. ఓవర్‌లోడు, లోఓల్టేజీ సమస్యలతో తరచూ విద్యుత సరఫరాల్లో అంతరాయలు కలుగుతున్నాయి. దీనికితోడు ట్రా న్సఫార్మర్లు కాలిపోతున్నాయి. జిల్లా వ్యా ప్తంగా 1,48,496 ట్రాన్సఫార్మర్లు ఉన్నాయి. ఇందులో సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్సఫార్మర్లు 17,178 ఉండగా..త్రీఫేజ్‌ ట్రాన్సఫార్మర్లు 1,31,318 ట్రాన్సఫార్మర్లు ఉన్నాయి. వివిధ సమస్యల కారణంగా ప్రతి రోజు పదుల సంఖ్యలో ట్రాన్సఫార్మర్లు మరమ్మతులకు గురవుతున్నాయి. గతేడాది మార్చి నుంచి జూన వరకు 1741 ట్రాన్సఫార్మర్లు మరమ్మతులకు గురయ్యాయి. ఇందు లో త్రీఫేజ్‌ ట్రాన్సఫార్మర్లు 1455ఉండగా..సింగిల్‌ ఫేజ్‌ ట్రా న్సఫార్మర్లు 286 ఉన్నాయి. ఇక ఈ ఏడాది మార్చి నెలలో 447 ట్రాన్సఫార్మర్లు పాడైపోయాయి. వీటిలో త్రీఫేజ్‌ 381 ఉండగా..సింగిల్‌ ఫేజ్‌ 66 ఉన్నా యి. వేసవికాలం ఆరం భంలోనే ఈస్థాయిలో ట్రాన్సఫార్మర్లు మరమ్మతులకు గురవుతుండటం ఆశాఖను కలవర పెడుతోంది. 


అంతరాయలు లేకుండా విద్యుత సరఫరా

- వరకుమార్‌, ఎస్‌ఈ, ఏపీఎస్పీడీసీఎల్‌


జిల్లాలో విద్యుత వినియోగం బాగా పెరిగింది. డిమాండ్‌కు అనుగుణం విద్యుత సరఫరా అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో పలు సాంకేతిక సమస్యల కారణంగా విద్యుత సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. వాటి ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అదనపు ట్రాన్సఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ట్రాన్సఫార్మర్లు చెడిపోయిన గం టల వ్యవధిలోనే మార్పు చేసి విద్యుత సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు  ఇబ్బందుల లేకుండా చర్యలు తీసు కుంటున్నాం. 


Advertisement
Advertisement
Advertisement