భోగి మంటల్లో జీవో ప్రతుల దహనం

ABN , First Publish Date - 2022-01-15T05:46:18+05:30 IST

బంగారుమెట్ట జంక్షన్‌లోని భోగి మంటల్లో టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రజా, రైతు వ్యతిరేక జీవో ప్రతులను వేసి నిరసన తెలిపారు.

భోగి మంటల్లో జీవో ప్రతుల దహనం
భోగి మంటలో జీవో పత్రులను దహనం చేస్తున్న తాతయ్యబాబు

టీడీపీ నాయకుల వినూత్న నిరసన


బుచ్చెయ్యపేట, జనవరి 14: బంగారుమెట్ట జంక్షన్‌లోని భోగి మంటల్లో టీడీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ప్రజా, రైతు వ్యతిరేక జీవో ప్రతులను వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటమే తప్ప రైతులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు. టీడీపీ అమలు చేసిన రైతు రుణమాఫీని రద్దు చేయడం దారుణమన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం, రూ.3 లక్షల లోపు సున్నా వడ్డీ రుణాలకు రూ.లక్షకే పరిమితం చేయడం, అదీ రైతులు ముందుగా వడ్డీ చెల్లించేలా జీవో జారీ చేయడం అన్నాయమన్నారు. వైసీపీ పాలనలో రైతులు సంక్రాంతి పండగ చేసుకునే పరిస్థితి లేదన్నారు. ప్రజావ్యతిరేక పాలనతో పబ్బం గడుపుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తాతయ్యబాబు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు గోకివాడ కోటేశ్వరరావు, డొంకిన అప్పలనాయుడు, సాయిం శేషు, దొండా నరేశ్‌, తమరాన దాసు, దొండా వెంకటరమణ, శ్రీను పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-15T05:46:18+05:30 IST