లేబర్‌ కోడ్‌ జీవో కాపీలు దహనం

ABN , First Publish Date - 2022-07-02T04:09:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబ ర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బస్టాండ్‌ ఎదుట ఐఎఫ్‌టీయూ నాయకులు లేబర్‌ కోడ్‌ జీవో కాపీలను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు.

లేబర్‌ కోడ్‌ జీవో కాపీలు దహనం
జీవో కాపీలను దహనం చేస్తున్న ఐఎఫ్‌టీయూ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 1: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబ ర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం బస్టాండ్‌ ఎదుట ఐఎఫ్‌టీయూ నాయకులు లేబర్‌ కోడ్‌ జీవో కాపీలను దహనం చేశారు. జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందన్నారు. ఎల్‌ఐసీ, బీఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకులు, రైల్వే, బొగ్గుగనులను ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. నాయకులు తిరుపతి, మల్లన్న, మహేష్‌, మబ్బులు, శ్రీనివాస్‌, మహేందర్‌ పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని టీసీవోఏ క్లబ్‌ ఆవరణలో లేబర్‌ కోడ్‌ పత్రాలను ఎస్‌సీసీడబ్య్లూయూ ఐఎఫ్‌టీయూ నాయకులు దహనం చేశారు. డివిజన్‌ అధ్యక్షుడు నారాయణ, రీజియన్‌ నాయకులు కృష్ణవేణిలు మాట్లాడుతూ  కార్మికులందరు ఐక్యంగా లేబర్‌ కోడ్‌కు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలన్నారు.   భాను, శ్యాం, లింగన్న, బుచ్చమ్మ, పద్మ, కమల పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-02T04:09:48+05:30 IST