ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న బెహ్రామ్ నగర్లో ఐదంతస్థుల భవనం కూలిపోయింది. ఘటనలో రెస్క్యూ టీమ్ ఇప్పటివరకూ ఆరుగురిని కాపాడింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్లను, అంబులెన్స్‌లను కూడా తరలించారు. శిథిలాల కింద ఇంకా పలువురు చిక్కుకున్నట్లు సమాచారం.