బడ్జెట్‌పై రాష్ట్రాలకు అతీతంగా ప్రశంసలు: మంత్రి

ABN , First Publish Date - 2022-03-20T15:35:42+05:30 IST

రాష్ట్ర శాసనసభలో శుక్రవారం 2022-23 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్రాలకు అతీతంగా ప్రశంసలు వస్తున్నాయని రాష్ట్ర హిందూ దేవాదాయ,

బడ్జెట్‌పై రాష్ట్రాలకు అతీతంగా ప్రశంసలు: మంత్రి

అడయార్‌(చెన్నై): రాష్ట్ర శాసనసభలో శుక్రవారం 2022-23 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌కు రాష్ట్రాలకు అతీతంగా ప్రశంసలు వస్తున్నాయని రాష్ట్ర హిందూ దేవాదాయ, ధర్మాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు తెలిపారు. మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఆదివారం 12 నుంచి 14 యేళ్ళలోపు చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేశారు. ఇందులోభాగంగా, స్థానిక కొళత్తూరులోని ఎవర్‌విన్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్‌ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఒక్క విపక్షం మినహా ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసిస్తున్నాయన్నారు. ఇకపోతే, కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు వ్యాక్సిన్‌ సరైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్లు వేయించుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పిలుపునిచ్చారన్నారు. ఈ పిలుపునకు స్పందించిన ప్రజలు 91 శాతం మేరకు వ్యాక్సిన్లు వేసుకున్నారన్నారు. వీరిలో రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్న వారిలో 81 శాతం మంది ప్రజలు ఉన్నారన్నారు. అలాగే, బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య 28,783గా ఉందన్నారు. 15 నుంచి 18 యేళ్ళ లోపు యువతలో 83 శాతం మేరకు వ్యాక్సిన్లు వేసినట్టు చెప్పారు. అయితే, ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే నేతలు దురుద్దేశ్యపూరితంగా ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నాయని మంత్రి పీకే శేఖర్‌ బాబు ఆరోపించారు. 

Updated Date - 2022-03-20T15:35:42+05:30 IST