చిగురిస్తున్న ఆశలు

ABN , First Publish Date - 2022-08-13T04:04:15+05:30 IST

యాభై ఏడేళ్లు నిండినవారికి ఆసరా పథకం కింద పింఛన్‌ అందిస్తాం అని సీఎం కేసీఆర్‌ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు నిరాశకు లోనయ్యారు. కాగా ఇటీవల ముఖ్యమం త్రి స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లోనే, అదీ ఆగస్టు 15నే రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందజేస్తామని ప్రకటించడం దరఖాస్తుదారులకు ఊరట కలిగిస్తోంది. 57 ఏళ్లు నిండిన వాళ్లు పెన్షన్‌ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొన్నారని, ఆ దరఖాస్తులు 10 లక్షలకు పైనే ఉంటాయని, వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు గురువారం రాష్ట్ర క్యాబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. కేసీఆర్‌ ప్రకటించిన గడువు ఇంకా మూడు రోజులే ఉండడంతో దరఖా స్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

చిగురిస్తున్న ఆశలు
లోగో

- కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం ప్రకటన

- జిల్లాలో 16,518 మంది దరఖాస్తుదారులు 

యాభై ఏడేళ్లు నిండినవారికి ఆసరా పథకం కింద పింఛన్‌ అందిస్తాం అని సీఎం కేసీఆర్‌ 2018లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు.  ఇన్నాళ్లుగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారు నిరాశకు లోనయ్యారు.  కాగా ఇటీవల ముఖ్యమం త్రి స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లోనే, అదీ ఆగస్టు 15నే రాష్ట్రంలో 10 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లు అందజేస్తామని ప్రకటించడం దరఖాస్తుదారులకు ఊరట కలిగిస్తోంది. 57 ఏళ్లు నిండిన వాళ్లు పెన్షన్‌ కోసం ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకొన్నారని, ఆ దరఖాస్తులు 10 లక్షలకు పైనే ఉంటాయని, వారందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఈ ప్రతిపాదనకు గురువారం రాష్ట్ర క్యాబినెట్‌ కూడా ఆమోదం తెలిపింది. కేసీఆర్‌ ప్రకటించిన గడువు ఇంకా మూడు రోజులే ఉండడంతో దరఖా స్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. 

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 12: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు15 నుంచి పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించడంతో దరఖాస్తుదారు లకు ఆశలు రేకిస్తున్నాయి. పింఛన్లు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తు న్న వారికి ముఖ్య మంత్రి ప్రకటన  ఒకింత ఊరట కలిగిస్తోంది. 57ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇస్తామని గతేడాది జూలైలో కేసీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆగస్టులో వృద్ధాప్య పింఛన్ల ఆర్హత వయస్సు 57ఏళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో వెంటనే అదేనెల15నుంచి 31వరకు మీసేవా కేంద్రాల ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను తీసుకున్నారు. సెప్టెంబరులో దరఖాస్తుల పరిశీలన పూర్తయిన వెంటనే కొత్త పింఛన్ల మంజూరు జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ అమలు కాలేదు. ఏడాది గడిచినా ఎవరికీ రాక పోవడంతో దరఖాస్తుదారులు నిరాశకు లోనయ్యారు. పాతపింఛన్ల పంపిణీకి ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు వెచ్చిస్తున్నం దువల్ల కొత్త వి మరింత భారం అయ్యే పరిస్థితి ఉండడంతో ఇప్పట్లో ఇవ్వకపోవచ్చని దరఖాస్తుదారులు నిరాశకు లోనయ్యారు. ఈ తరుణంలో ముఖ్యమంత్రి ప్రకటన వారిలో ఆశలను చిగురింపజేసింది. 

నాలుగేళ్లుగా ఆగిన కొత్త పింఛన్లు..

నాలుగేళ్లుగా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయడం లేదు. 57ఏళ్లు నిండిన వారి పింఛన్ల సంగతి పక్కన పెడితే వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాల బాధితులు, ఒంటరి మహిళలకు కూడా కొత్తవి మంజూరు కాలేదు. జిల్లాలో 57ఏళ్లు నిండిన వారు 16,518 దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 12,341మంది, వితం తువులు 3,120 మంది, దివ్యాంగులు 690మంది, గీతకార్మికులు 14మం ది, చేనేత కార్మికులు 24 మంది, బీడీ కార్మికులు ఐదుగురు, ఒంటరి మహిళలు 195మంది, ఫైలేరియా 129 మంది ఉన్నారు. కాగా ఇప్పటికే జిల్లాలో 45,337మంది ఆసరా పింఛన్‌ పొందుతున్నారు. వీటిలో వృద్ధు లు 16,397మంది, వితంతువులు 19,747మంది, దివ్యాంగులు 5,54 2మంది, గీత కార్మికులు 127మంది, చేనేత కార్మికులు 484మంది, ఫైలేరి యా బాధితులు 477మంది, ఒంటరి మహిళలు 2481మంది, బీడి కార్మి కులు 82మంది ఉన్నారు.

ప్రభుత్వానికి జాబితా పంపించాం..

- సురేందర్‌, డీఆర్డీవో, ఆసిఫాబాద్‌

జిల్లాలో తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబి తాను ప్రభుత్వానికి పంపించాం. జిల్లాలో 16,518మందిని అర్హులుగా గుర్తించాం. ప్రభుత్వం నుంచి జాబితా వచ్చిన వెంటనే పింఛన్లను మం జూరు చేస్తాం. కొత్త పింఛన్ల పంపిణీ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటాం.

Updated Date - 2022-08-13T04:04:15+05:30 IST