బీటీపీ ఎడమ కాలువ పైపింగ్‌ పూడ్చివేత

ABN , First Publish Date - 2022-01-18T06:03:28+05:30 IST

మండలంలోని బైరవానతిప్ప ప్రాజెక్టు ఎడమ కా లువ పరిధిలోని 13వ డిసి్ట్రబ్యూటరీ సమీపంలో సాగునీటి విడుదల సందర్భం గా ఆదివారం పైపింగ్‌ పడిన విషయం తెలిసిందే.

బీటీపీ ఎడమ కాలువ పైపింగ్‌ పూడ్చివేత
కాలువ పైపింగ్‌ను పూడ్చివేసిన దృశ్యం

గుమ్మఘట్ట, జనవరి 17: మండలంలోని బైరవానతిప్ప ప్రాజెక్టు ఎడమ కా లువ పరిధిలోని 13వ డిసి్ట్రబ్యూటరీ సమీపంలో సాగునీటి విడుదల సందర్భం గా ఆదివారం పైపింగ్‌ పడిన విషయం తెలిసిందే. ఘటనపై ఇరిగేషన అధికారులు అప్రమత్తమై సాగునీటిని 12వ డిసి్ట్రబ్యూటరీ నుంచి కేవీ ట్యాంకు వద్ద  ఆపారు. కాలువలో వున్న నీటిని డిసి్ట్రబ్యూటరీ నుంచి బయటకు మళ్లించి సోమవారం సాయంత్రం వరకు మరమ్మతు పనులు చేపట్టారు. ఇరిగేషన డీఈ నరసింహారావు, జేఈలు గౌస్‌ బాషా, చెన్నారెడ్డి పైపింగ్‌ పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా మట్టి తరలించి పైపింగ్‌ను పూడ్చివేశారు. ఆ యకట్టు రైతులకు ఒకరోజు అంతరాయం మాత్రమే కలిగిందని, సాయంత్రానికి సాగునీటిని కాలువకు విడుదల చేసినట్లు తెలిపారు. రెండు రోజుల పాటు 30 క్యూసెక్కుల సాగునీరు వదలి, అనంతరం ఎక్కువ మోతాదులో నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. రైతులు ముందస్తుగా నార్లు పోసుకుని పొలాలను సి ద్ధం చేసుకుని సాగునీరు వృథా కాకుండా సద్వినియోగం చేసుకోవాలన్నారు. 


Updated Date - 2022-01-18T06:03:28+05:30 IST