రూ.754 కోట్ల బ్యాంకు మోసం కేసులో బీఎస్పీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు

ABN , First Publish Date - 2020-10-20T07:08:19+05:30 IST

రూ.754.24 కోట్ల బ్యాంక్‌ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీ, ఆయన భార్య రీటా తివారీపై సీబీఐ కేసు నమోదు చేసింది. గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్...

రూ.754 కోట్ల బ్యాంకు మోసం కేసులో బీఎస్పీ ఎమ్మెల్యేపై సీబీఐ కేసు

న్యూఢిల్లీ, అక్టోబరు 19: రూ.754.24 కోట్ల బ్యాంక్‌ మోసం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఎస్పీ ఎమ్మెల్యే వినయ్‌ శంకర్‌ తివారీ, ఆయన భార్య రీటా తివారీపై సీబీఐ కేసు నమోదు చేసింది. గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌, దాని డైరెక్టర్‌ అజిత్‌ పాండేలపై కూడా కేసు నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. తివారీ ఉత్తరప్రదేశ్‌లోని చిల్లుపర్‌ (గోరఖ్‌ఫూర్‌) ఎమ్మెల్యేగా ఉన్నారు. సోమవారం తివారీ నివాసంతోపాటు లఖ్‌నవూలోని గంగోత్రి ఎంటర్‌ప్రైజెస్‌ కార్యాలయంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.   

Updated Date - 2020-10-20T07:08:19+05:30 IST