భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2020-08-08T02:31:32+05:30 IST

బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న వెండి ఆభరణాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

కోల్‌కతా : బంగ్లాదేశ్‌కు అక్రమంగా తరలిస్తున్న వెండి ఆభరణాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని బసీర్‌హట్ సమీపంలో కైజురి వద్ద ఓ ద్విచక్ర వాహన చోదకుడి నుంచి వీటిని స్వాధీనం చేసుకున్నారు.సౌత్ బెంగాల్ బీఎస్ఎఫ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను తెలిపింది. 


సౌత్ బెంగాల్ బీఎస్ఎఫ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, కైజురి వద్ద గురువారం రాత్రి ఓ స్మగ్లర్ మోటార్‌బైక్‌పై సరిహద్దుకు చేరుకోగానే బీఎస్ఎఫ్ సిబ్బంది వెంటాడి, ఆపారు. ఆ స్మగ్లర్ వెంటనే ఆ బైక్‌ను వదిలిపెట్టి పారిపోయాడు. వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ బైక్‌లోని టూల్‌బాక్స్‌ను తెరిచి చూసినపుడు 13 కేజీల వెండి ఆభరణాలు కనిపించాయి. వీటి విలువ రూ.9,60,720 ఉంటుంది. ఆ ఆభరణాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ ఆధారంగా ఆ బైక్, ఆ వ్యక్తి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం జరుగుతోంది. 


Updated Date - 2020-08-08T02:31:32+05:30 IST