బీఎస్ఎఫ్ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్

ABN , First Publish Date - 2020-03-29T11:37:50+05:30 IST

కరోనా వైరస్ రోగుల కోసం సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో సూపర్‌వైజరీ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది....

బీఎస్ఎఫ్ అధికారికి కరోనా వైరస్ పాజిటివ్

భోపాల్ (మధ్యప్రదేశ్): కరోనా వైరస్ రోగుల కోసం సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో సూపర్‌వైజరీ అధికారిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని టేకాన్ పూర్ పట్టణంలో ఏర్పాటు చేసిన బీఎస్ఎఫ్ క్వారంటైన్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్ అధికారికి కరోనావైర్ సోకడంతో అతన్ని వెంటనే ఐసోలేషన్ గదికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారి భార్య 15రోజుల క్రితమే యూకే నుంచి స్వదేశానికి తిరిగివచ్చింది.కరోనా వైరస్ సోకిన బీఎస్ఎఫ్ అధికారి మార్చి 15 నుంచి 19 తేదీల మధ్య బీఎస్ఎఫ్ ఏడీజీ, ఐజీ ర్యాంకు అధికారులతో కలిసి సమావేశాల్లో పాల్గొన్నారని తేలడంతో వారందరినీ క్వారంటైన్ కు తరలించారు. ముందుజాగ్రత్తగా కరోనా పాజిటివ్ వచ్చిన బీఎస్ఎఫ్ అధికారితో కలిసి పనిచేసిన పలువురు బీఎస్ఎఫ్ అధికారులు,వారి కుటుంబసభ్యులను క్వారంటైన్ కు తరలించారు.

Updated Date - 2020-03-29T11:37:50+05:30 IST