నలుపు మాటున రంగుల రహస్యం

ABN , First Publish Date - 2020-03-29T08:24:46+05:30 IST

నలుపు రంగులో దాగి ఉన్న ఇతర రంగులను గుర్తించే సరికొత్త పద్ధతిని బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదాహరణకు ఒక సీతాకోకచిలుక రెక్కలు మనకు నీలిరంగులో ...

నలుపు మాటున రంగుల రహస్యం

బర్మింగ్‌హాం(బ్రిటన్‌), మార్చి 28: నలుపు రంగులో దాగి ఉన్న ఇతర రంగులను గుర్తించే సరికొత్త పద్ధతిని బ్రిటన్‌లోని బర్మింగ్‌హాం వర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఉదాహరణకు ఒక సీతాకోకచిలుక రెక్కలు మనకు నీలిరంగులో కనిపించాయని అనుకుందాం. వాటి రెక్కల ఉపరితలంపై ఉండే సన్నపాటి గీతలపై నీలికాంతి మాత్రమే ప్రతిబింబించడంతో అవి మనకు అదే రంగులో కనిపిస్తుంటాయి. ఈ నియమం ఆధారంగా శాస్త్రవేత్తలు నలుపు రంగు మాటున దాగిన ఇతర రంగులను విశ్లేషించారు. ఈ కొత్త పద్ధతిలో నలుపు వర్ణపటం పైభాగంలో ఒక లిథోగ్రఫిక్‌ ప్లేట్‌, దానిపై ఓ అద్దం, ఆపైన అతిసూక్ష్మమైన బంగారు వర్ణపు పూసలను రాశిగా పేర్చారు. వర్ణపటం కింది భాగంలో ఓ అద్దాన్ని ఉంచారు. సూర్యకాంతి బంగారు వర్ణపు పూసలపై ప్రసరించగానే.. నలుపు వర్ణపటం కింది భాగంలోని అద్దంపైకి విభిన్న రంగులు విడుదలవుతాయి. అలా విడుదలయ్యే రంగులే.. నలుపు వర్ణపటంలో దాగి ఉన్నవని గుర్తించవచ్చు. 

Updated Date - 2020-03-29T08:24:46+05:30 IST