నివాసాల మధ్యే ఇటుక బట్టీలు

ABN , First Publish Date - 2021-01-12T04:49:28+05:30 IST

ఇటుక బట్టీలు.. బొగ్గుల బట్టీలు, సున్నపు బట్టీలు పట్టణ శివార్లలో ఉండడం చూస్తుంటాం.

నివాసాల మధ్యే ఇటుక బట్టీలు
కుమ్మరివీధిలో వెలసిన బట్టీలు

ఇబ్బందుల్లో నగరవాసులు

కడప, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): ఇటుక బట్టీలు.. బొగ్గుల బట్టీలు, సున్నపు బట్టీలు పట్టణ శివార్లలో ఉండడం చూస్తుంటాం. అయితే కడప నబీకోటలో మాత్రం జనావాసాల మధ్యనే నాలుగు ఇటుక బట్టీలను ఏర్పాటు చేయడం విశేషం. వీటి ద్వారా వచ్చే పొగ వల్ల చుట్టుపక్కల నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నబీకోట శివాలయం పరిధిలోని కుమ్మరివీధిలో కొందరు నాలుగు బొగ్గుల బట్టీలను ఏర్పాటు చేశారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ కృష్ణసింగ్‌తో మాట్లాడగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-01-12T04:49:28+05:30 IST