తల్లి పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

ABN , First Publish Date - 2022-08-07T05:11:09+05:30 IST

తల్లిపాలతో పిల్లల్లో రోగనిరో ధక శక్తి పెరుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శనివారం తల్లిపాల వారోత్సవంలో భాగంగా తల్లిపాల ఆవశ్యకతపై జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వ హించారు. అనంతరం ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన కౌమారదశ బాలికలకు న్యూట్రిషన్‌కిట్ల పంపిణీ కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి కిట్లను అందజేశారు.

తల్లి పాలతో రోగ నిరోధకశక్తి పెరుగుతుంది
న్యూట్రీషియన్‌ కిట్లు పంపిణీ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి

- జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి

ఆసిఫాబాద్‌, ఆగస్టు 6: తల్లిపాలతో పిల్లల్లో రోగనిరో ధక శక్తి పెరుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. శనివారం తల్లిపాల వారోత్సవంలో భాగంగా తల్లిపాల ఆవశ్యకతపై జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వ హించారు. అనంతరం ఆదివాసీ భవన్‌లో ఏర్పాటు చేసిన కౌమారదశ బాలికలకు న్యూట్రిషన్‌కిట్ల పంపిణీ కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో అంగన్‌వాడీలు ప్రచారం నిర్వహించాలన్నారు. పిల్లలకు తల్లిపాలు ఎంతో శక్తిని స్తాయన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వ ర్‌రావు, జిల్లా మహిళా శిశుసంక్షేమ శాఖాధికారి సావిత్రి, సీడీపీవో సాదియా రుక్సానా పాల్గొన్నారు.

దహెగాం: మండలంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని శనివారం అవగాహనర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్య తను వివరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు పార్వతి, పద్మ, మమత, విజయ పాల్గొన్నారు.

జైనూరు: గర్భిణులు, చిన్నారులు అంగన్‌వాడీ కేంద్రాల్లోఅందిస్తున్న పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని సూపర్‌వైజర్‌ పింటు కోరారు. మండలంలోని భుసి మెట్టలో శుక్రవారం తల్లిపాలవారోత్సవాలు అంగన్‌వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

Updated Date - 2022-08-07T05:11:09+05:30 IST