కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-02-27T05:04:13+05:30 IST

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు

కనుల పండువగా బ్రహ్మోత్సవాలు
కడ్తాల్‌ : రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

  • ఆలయాల్లో పూజల్లో పాల్గొన్న ప్రముఖులు

కడ్తాల్‌ : మండల కేంద్రంలోని లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ వార్షిక బ్రహోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా నాల్గవ రోజు శుక్రవారం తెల్లవారుజామున అగ్నిగుండాలు, రాత్రి పుష్పమాల సేవ(చిన్నరథోత్సవం) కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఉరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాళ్లతో రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. అదేవిధంగా విష్ణుసహస్ర నామ పారాయణం, పుష్పార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, ఉప సర్పంచ్‌ కడారి రామకృష్ణ, ఎంపీటీసీ శ్రీనివా్‌సరెడి, వైస్‌ ఎంపీపీ ఆనంద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ గంప వెంకటేశ్‌, అర్చకులు పాల్గొన్నారు.


దైవ కార్యక్రమాలు లోక శాంతికి దోహదం

దైవ, ఆధ్యాత్మిక కార్యక్రమాలు లోకశాంతికి దోహదపడతాయని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కడ్తాల మండల కేంద్రం సమీపంలోని కాకూస్‌ గ్రీన్‌ సిటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులతో లోకమంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో శివకుమార్‌, వెంకట్‌, సంజీవరెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ఘనంగా దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞం 

మాడ్గుల : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని శాంతి భారతి పురస్కార గ్రహీత, ఆధ్యాత్మిక సేవా ప్రపూర్ణ దేవీ ఉపాసకులు మురకుంట్ల  రాజేశ్వరశర్మ అన్నారు. మండలంలోని సుద్దపల్లి సర్పంచ్‌ వెంకటేశ్వర్లుగౌడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం దేవీత్రయ గీతాజ్ఞాన యజ్ఞం నిర్వహించారు. 


వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

కేశంపేట: మండలంలోని కొండారెడ్డిపల్లి, పోమాల్‌పల్లి శివారులోని గుట్టపై వెలసిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. సర్పంచులు పల్లె స్వాతిబాలిశ్వర్‌, కృష్ణయ్య, పల్లె ఆనంద్‌కుమార్‌లు పోమాల్‌పల్లి నుంచి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా గుట్టపైకి తీసుకెళ్లారు. శనివారం పద్మావతి, వెంకటేశ్వరస్వామిల కళ్యాణం నిర్వహించానున్నారు. మార్చి 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. 


ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం

 షాబాద్‌: మండలంలోని గొల్లురిగూడ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేకపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అదే విధంగా షాబాద్‌ మండల పరిధి చందనవెల్లి గ్రామంలో శివస్వాముల పూజా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాశివుడికి పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అవినా్‌షరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:04:13+05:30 IST