బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

ABN , First Publish Date - 2020-10-19T06:31:14+05:30 IST

దేశీయంగా తయారుచేసిన స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ నౌక ఐఎన్‌ఎ్‌స చెన్నై నుంచి బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది.

బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

న్యూఢిల్లీ, అక్టోబరు 18: దేశీయంగా తయారుచేసిన స్టెల్త్‌ డిస్ట్రాయర్‌ నౌక ఐఎన్‌ఎ్‌స చెన్నై నుంచి బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణిని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. ఈ మేరకు రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘‘ఐఎన్‌ఎ్‌స చెన్నై నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి విజయవంతంగా, అత్యంత కచ్చితత్వంతో అరేబియా సముద్రంలోని లక్ష్యాన్ని ఛేదించింది.


బ్రహ్మోస్‌ జత అయితే యుద్ధనౌక సముద్ర జలాలలపై సుదూర లక్ష్యాలను కూడా అద్భుతంగా ఛేదించి అజేయంగా నిలవగలదు. భారత నౌకాదళాన్ని ఇది మరింత శక్తిమంతంగా మారుస్తుంది’’ అని రక్షణశాఖ స్పష్టం చేసింది. భారత్‌-రష్యా సంయుక్తంగా ఏర్పరిచిన బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌ సంస్థ ఈ క్షిపణిని తయారుచేస్తోంది. దీన్ని సబ్‌మెరైన్ల నుంచి, నౌకలు, యుద్ధవిమానాలు, భూతల వేదికల నుంచి ప్రయోగించవచ్చు

. క్షిపణి ప్రయోగం విజయం పట్ల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్‌డీఓను ఆయన అభినందించారు. ఈ క్షిపణి పలు విధాలుగా భారత సాయుధ బలగాలకు అండగా నిలుస్తుందని డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి అన్నారు. సంస్థ పరిశోధకులు, సిబ్బందిని ఆయన అభినందించారు. 


Updated Date - 2020-10-19T06:31:14+05:30 IST