కాంగ్రెస్తో జతకట్టిన బీపీఎఫ్ పార్టీ
గువహటి, ఫిబ్రవరి 27: అసెంబ్లీ ఎన్నికల వేళ.. అసోంలో బీజేపీకి దాని మిత్రపక్షం బీపీఎఫ్ (బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్) ఝలక్ ఇచ్చింది. అధికార పక్షంతో ఉన్న ఐదేళ్ల బంధాన్ని తెంచుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిలో చేరింది. ఈ విషయాన్ని బీపీఎఫ్ పార్టీ నాయకుడు హగ్రామా మొహిలరీ శనివారం సోషల్మీడియా ద్వారా వెల్లడించారు.