లంబసింగి ఘాట్‌పై బండరాళ్లు

ABN , First Publish Date - 2022-08-13T05:48:40+05:30 IST

లంబసింగి ఘాట్‌లో బండరాళ్లు జారీ పడడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

లంబసింగి ఘాట్‌పై బండరాళ్లు
తురబాడుగెడ్డ-డౌనూరు మధ్యలో పడిన బండరాయి

ప్రయాణికుల ఇక్కట్లు.. తొలగించాలని వేడుకోలు


చింతపల్లి, ఆగస్టు 12: లంబసింగి ఘాట్‌లో బండరాళ్లు జారీ పడడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఏజెన్సీలో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లంబసింగి ఘాట్‌పై అడవి నుంచి బండరాళ్లు జారిపడుతున్నాయి. ప్రధానంగా బోడకొండమ్మ దేవాలయం దిగువన నాలుగు, ఐదు మలుపుల వద్ద బండరాళ్లు రహదారిపై పడి వున్నాయి. తురబాడుగెడ్డ- డౌనూరు మధ్యలో భారీ బండరాయి రహదారి మధ్యలో పడివుంది. దీంతో చింతపల్లి-నర్సీపట్నం మార్గంలో రాకపోకలు సాగిస్తున్న వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళ బండరాళ్లు కనిపించడంలేదు. దీంతో బండరాళ్ల వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇప్పటికైనా ఆర్‌ అండ్‌ బీ అధికారులు స్పందించి ఘాట్‌పై పడివున్న బండరాళ్లను తొలగించాలని వాహనచోదకులు కోరుతున్నారు.

Updated Date - 2022-08-13T05:48:40+05:30 IST