Border Security Force: పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ కాల్పులు

ABN , First Publish Date - 2022-10-04T15:28:54+05:30 IST

పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సోమవారం రాత్రి ఎగురుతున్న పాక్ డ్రోన్లపై సరిహద్దు భద్రతా దళం(Border Security Force) ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది...

Border Security Force: పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ కాల్పులు

శ్రీనగర్: పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో సోమవారం రాత్రి ఎగురుతున్న పాక్ డ్రోన్లపై సరిహద్దు భద్రతా దళం(Border Security Force) ఐదు రౌండ్లు కాల్పులు జరిపింది.( five rounds were fired)పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ సెక్టారులోని అంతర్జాతీయ సరిహద్దు కంచెకు కేవలం 100 మీటర్ల దూరంలో పాక్ డ్రోన్లు ఎగురుతుండగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు(fires at drones) జరిపారు. అంతర్జాతీయ సరిహద్దు ఫెన్సింగుకు 30 మీటర్ల దూరంలో ఎగిరిన పాక్ డ్రోన్లు భారత భూభాగంలో 19 నిమిషాలుందని బీఎస్ఎఫ్ అధికారులు చెప్పారు. 


పాక్ డ్రోన్ల(Pakistan border) సంచారంపై అంబాలా వాయుసేన విభాగం అధికారులు, స్థానిక పోలీసులు సమాచారం అందించారు. బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరపడంతో పాక్ డ్రోన్లు(suspected drone activity) తిరిగి పాక్ భూభాగం వైపు వెళ్లాయి. పాకిస్థాన్ డ్రోన్ల ద్వారా మన దేశంలోకి ఆయుధాలు పంపిస్తుందా అనే కోణంలో బీఎస్ఎఫ్ దర్యాప్తు చేస్తోంది. 

Updated Date - 2022-10-04T15:28:54+05:30 IST