బూస్టర్‌ డోసులు బాగా పని చేస్తున్నాయ్‌

ABN , First Publish Date - 2021-12-04T06:43:06+05:30 IST

కొవిడ్‌ వేరియంట్లకు చెక్‌ పెట్టేందుకు వివిధ టీకా సంస్థలు అభివృద్ధి చేస్తున్న బూస్టర్‌ డోసులు మంచి ఫలితాలనిస్తున్నాయని...

బూస్టర్‌ డోసులు బాగా పని చేస్తున్నాయ్‌

పలు వ్యాక్సిన్లపై బ్రిటన్‌ ఆరోగ్య సంస్థ పరిశోధన

న్యూఢిల్లీ, డిసెంబరు 3: కొవిడ్‌ వేరియంట్లకు చెక్‌ పెట్టేందుకు వివిధ టీకా సంస్థలు అభివృద్ధి చేస్తున్న బూస్టర్‌ డోసులు మంచి ఫలితాలనిస్తున్నాయని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్‌, నోవావ్యా క్స్‌, జాన్సన్‌, మొడెర్నా, వాల్నెవా, క్యూర్‌వ్యాక్‌ టీకాల బూస్టర్‌ డోసులు సమర్థంగా పనిచేస్తున్నాయని బ్రిటన్‌లోని యూనివర్సిటీ హాస్పిటల్‌ సౌతాంప్టన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ ఫౌండేషన్‌ ట్రస్టుకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. ఆయా టీకాల బూస్టర్‌ డోసులు సురక్షితమని, వీటి వల్ల రోగనిరోధక శక్తి బాగా పెంపొందుతోందని పరిశోధనలో వెల్లడైంది. రెండు డోసుల ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో 79ు, ఫైజర్‌ టీకా తీసుకున్న వారిలో 90ు కొవిడ్‌ నుంచి రక్షణ కలిగిందని పరిశోధకులు కనుగొన్నారు.

Updated Date - 2021-12-04T06:43:06+05:30 IST