Abn logo
Nov 23 2020 @ 01:10AM

దుద్దెడలో ఘనంగా బోనాల పండుగ


కొండపాక, నవంబరు 22:  మండలంలోని దుద్దెడ గ్రామంలో ఆదివారం ఆరె క్షత్రియుల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను నిర్వహించారు. ప్రతీ సంవత్సరం కార్తీక మాసంలో గ్రామంలోని ఊర పోచమ్మ, దూసకుంట నల్ల పోచమ్మ దేవతలకు బోనాలను ఆనవాయితీగా సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఆరె కులస్థులు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, యువకుల చిందులు, బాణాసంచాల మోతతో గ్రామంలో బోనాల పండుగ కనుల పండువగా సాగింది. కార్యక్రమంలో ఎంపీటీసీ గురజాడ బాలాజి, ఆరె క్షత్రియ సంఘం నాయకులు దొడ్ల రమేష్‌, శివాజీగారి బాల్‌రెడ్డి కుసుంబ నర్సింగరావు, బూర్గుల వెంకటరమణ, కనకారావు, కృష్ణ, హరికిషన్‌, దొడ్ల వెంకటేశం, మల్లేశం, కనకయ్య  పాల్గొన్నారు.Advertisement
Advertisement