బోనాల జాతర

ABN , First Publish Date - 2021-07-26T05:21:32+05:30 IST

బోనాల జాతర

బోనాల జాతర
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న దత్తాత్రేయ, జనార్ధన్‌రెడ్డి, తదితరులు

  • అమ్మవార్లకు నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న ప్రజలు
  • ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌)/ వికారాబాద్‌/మేడ్చల్‌/ కందుకూరు/శామీర్‌పేట/మూడుచింతలపల్లి/కొత్తూర్‌/తాండూర్‌రూరల్‌/ పరిగి /దౌల్తాబాద్‌/ఇబ్రహీపట్నం/మర్పల్లి/బషీరాబాద్‌/ కులకచర్ల/ చేవెళ్ల/షాద్‌నగర్‌ అర్బన్‌/మహేశ్వరం/ కందుకూరు/ఘట్‌కేసర్‌ :  ఆషాఢ మాసం సందర్భంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పెద్దఎత్తున బోనాల జాతర నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో పురవీధుల వెంట ఊరేగుతూ అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. డప్పువాయిద్యాలు, పోతురాజల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో ఆద్యంతం భక్తిపారవశ్యంతో ప్రజలు పులకించిపోయారు.  హర్యానా గవర్నర్‌ దత్తాత్రేయ, చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి జనార్ధన్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ దగ్గరుండి అమ్మవారి దర్శనం చేయించారు. మేడ్చల్‌ పట్టణంలోని జాతీయ రహదారి పక్కనగల ఏడుగుళ్ల అమ్మవార్లకు బోనాలు కనులపండువగా నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఫలహార బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికానర్సింహారెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సింహారెడ్డి, మోహన్‌రెడ్డి, నరేందర్‌, శ్రవణ్‌కుమార్‌గుప్త, నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వికారాబాద్‌ పట్టణం వెంకటాపూర్‌ కాలనీలో మహిళలు పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ చందర్‌నాయక్‌ పాల్గొన్నారు. కందుకూరు మండలం లేమూరులో కురుమ, గొల్ల కులస్థులు మహంకాళి బోనాలను ఘనంగా జరుపుకున్నారు. సర్పంచ్‌ పరంజ్యోతి, ఎంపీటీసీ రాములు, ఉపసర్పంచ్‌ కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని శామీర్‌పేట, అలియాబాద్‌, బాబాగూడ, ఉద్దెమర్రి అనంతారంలో బోనాల పండుగను నిర్వహించారు. కొత్తూర్‌ మండలం శేరిగూడబద్రాయపల్లిలో మహంకాళి బోనాలు నిర్వహించారు. జడ్పీటీసీ శ్రీలతాసత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. శంషాబాద్‌ మున్సిపల్‌ కేంద్రంలోని పలు బస్తీల్లో బోనాలు తీశారు. పోచమ్మగడ్డ పోచమ్మతల్లి ఆలయంతో పాటు మధురానగర్‌, ఆర్బీనగర్‌, రాళ్లగూడ, ఆదర్శ్‌నగర్‌ బస్తీల్లోని పోచమ్మ ఆలయాలను అందంగా అలంకరించారు. మధురానగర్‌ పోచమ్మ ఆలయ కమిటీ సభ్యులు  మల్లారెడ్డి, జెల్‌పల్లి శ్రీను, ప్రసాద్‌, కృష్ణ, నర్సింహ, దేవేందర్‌రెడ్డి, సంతో్‌షరెడ్డిల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి. ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మామహేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వెంకటేశ్‌గౌడ్‌, కౌన్సిలర్లు, స్రవంతీశ్రీకాంత్‌రెడ్డి, ఆయిల్‌ కుమార్‌తో స్థానికులు పాల్గొన్నారు. పరిగిలో మహిళలు బోనాలతో పట్టణ వీధుల వెంట ఊరేగుతూ మైసమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ అశోక్‌ పూజల్లో పాల్గొన్నారు. తాండూరు మండలం అంతారంపాటు పలు గ్రామాల్లో బోనాలు సమర్పించారు. అంతారంలోని పోచమ్మ, కట్టమైసమ్మ ఆలయాల్లో మహిళలు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వడ్డె శ్రీనివాస్‌, సర్పంచ్‌ రాములు, ఎంపీటీసీ శాంతు, తదితరులు పాల్గొన్నారు. దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో పోచమ్మ దేవతకు శ్రీభీమసేన ఆలయం నుంచి మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి పోచమ్మకు నైవేద్యం సమర్పించారు. ఇబ్రహీంపట్నం టౌన్‌లో మహంకాళి బోనాలు వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ యాదగిరి, డబ్బీకార్‌ శ్రీనివా్‌సతోపాటు కౌన్సిలర్లు పూజలు నిర్వహించారు. కృష్ణమాచారి, జలమోని రవీందర్‌, జక్క రాంరెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మర్పల్లి మండల కేంద్రంలో బోనాల జాతర ఘనంగా  జరుపుకున్నారు. బషీరాబాద్‌లోని జయంతి కాలనీ మహిళలు మైసమ్మకు బోనాలు తీశారు. కులకచర్ల మండలం గోగ్యానాయక్‌తండాలో బంగారు మైసమ్మకు బోనాలు తీశారు. ఘట్‌కేసర్‌ మండలం చౌదరిగూడ పంచాయతీ వెంకటాద్రి టౌన్‌షి్‌పలో పోచమ్మ, చిత్తరమ్మ అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. సర్పంచ్‌ రమాదేవి, ఎంపీటీసీ భాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ రాములుగౌడ్‌ పాల్గొన్నారు. షాద్‌నగర్‌అర్బన్‌ ఫరూఖ్‌నగర్‌ మండలంలోని మధురాపురంలో యాదవులు మహంకాళి బోనాలను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శివశంకర్‌రెడ్డి, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి, ఎంపీటీసీ భార్గవ్‌కుమార్‌రెడ్డి, గ్రామ పెద్దలున్నారు. మహేశ్వరం మండలంలోని ఆయా గ్రామాలతో పాటు తుక్కుగూడ మున్సిపల్‌ పరిధిలో మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించారు. తుక్కుగూడ, మంఖాల్‌, రావిరాలలో దేప భాస్కర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, అందెల శ్రీరాములుయాదవ్‌లు పూజలు నిర్వహించారు. తుక్కుగూడ మున్సిపల్‌ చైర్మన్‌ మధుమోహన్‌, కౌన్సిలర్లు రాజమోని రాజు, సుమన్‌, రవినాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-26T05:21:32+05:30 IST