Abn logo
May 24 2020 @ 00:00AM

ఈ ఆసనంతో శరీరం శక్తిమంతం!

ఈ ఆసనం మెదడును చల్లబరుస్తుంది. శరీరాన్ని శక్తిమంతం చేస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఈ ఆసనాన్ని అధోముఖ శ్వానాసనం అంటారు. ఇది ఎలా వేయాలంటే...


  1. నేలపై బోర్లా పడుకోవాలి. 
  2. నెమ్మదిగా చేతులపై లేస్తూ నడుము భాగం పైకి లేపాలి. అదే సమయంలో కాళ్లను దగ్గరకు తీసుకురావాలి.
  3. కాళ్లు మడవకూడదు. శరీరం గ ఆకారంలో ఉండేలా వంగాలి. 
  4. అలా 30 సెకన్ల పాటు ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. 
  5. రెండు మూడు సార్లు ఈ ఆసనాన్ని వేయాలి. 

Advertisement
Advertisement
Advertisement