కెరటాల ఉధృతికి బోటు బోల్తా

ABN , First Publish Date - 2021-06-24T06:01:52+05:30 IST

సముద్రంలో వేట చేస్తూ ఒడ్డుకు చేరుతున్న బోటు కెరటాల ఉధృతికి బోల్తా కొట్టింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ చేపలు, వలలను కోల్పోవడంతో రూ.2 లక్షల నష్టం వచ్చింది. మాయాపట్నానికి చెందిన తిక్కాడ సూరిబాబు ఇంజన్‌ బోటుపై బుధవారం ఆరుగురితో కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లాడు.

కెరటాల ఉధృతికి బోటు బోల్తా
అమీనబాద్‌ రేవులో చేపలతో బోల్తాపడిన బోటుపైకి ఎక్కిన మత్స్యకారులు

 రూ.2 లక్షల నష్టం
ఉప్పాడ (కొత్తపల్లి), జూన్‌ 23: సముద్రంలో వేట చేస్తూ ఒడ్డుకు చేరుతున్న బోటు కెరటాల ఉధృతికి బోల్తా కొట్టింది. అయితే ఎవరికీ ఎటువంటి ప్రమాదం లేనప్పటికీ  చేపలు, వలలను కోల్పోవడంతో రూ.2 లక్షల నష్టం వచ్చింది.  మాయాపట్నానికి చెందిన తిక్కాడ సూరిబాబు ఇంజన్‌ బోటుపై బుధవారం ఆరుగురితో కలిసి సముద్రంలోకి వేటకు వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో అమీనాబాద్‌ సమీపాన  కెరటాల ధాటికి బోటు తల్లకిందులైంది. దీంతో మత్స్యకారులందరూ సముద్రంలో దూకేసి ప్రాణాలను కాపాడుకున్నారు. సమాచారం తెలియడంతో 50 మంది మత్స్యకారులు వచ్చి కష్టపడి బోటును ఒడ్డుకు తీసుకువచ్చారు. అప్పటికే బోటులో ఉన్న వలలు, చేపలు సముద్రంలో కొట్టుకొనిపోవడంతో రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన చెందారు. 

Updated Date - 2021-06-24T06:01:52+05:30 IST