Bengaluru: నేటి నుంచి మెట్రోరైలు వేళల పొడిగింపు

ABN , First Publish Date - 2021-09-18T14:22:18+05:30 IST

బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీయల్) మెట్రో సర్వీసుల సమయాలను నేటి నుంచి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది...

Bengaluru: నేటి నుంచి మెట్రోరైలు వేళల పొడిగింపు

బెంగళూరు: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీయల్) మెట్రో సర్వీసుల సమయాలను నేటి నుంచి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకు ముందు, మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నడిచేవి. కానీ కొత్త టైమింగ్‌ల అమలుతో శనివారం నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రోరైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. బైయ్యప్పనహళ్లి, కెంగేరి, నాగసంద్ర, సిల్క్ ఇన్ స్టిట్యూట్ టెర్మినల్ స్టేషన్ల నుంచి మెట్రో రైలు చివరి సర్వీసు 9.30 గంటలకు బయలుదేరుతుందని మెట్రో అధికారులు చెప్పారు.


రద్దీ సమయాల్లో ప్రతీ 5 నిమిషాలకు, వారంరోజుల్లో ప్రతి 10 నిమిషాలకు మెట్రో రైళ్ల సర్వీసులు నడుపుతామని అధికారులు వివరించారు.సిల్క్ ఇనిస్టిట్యూట్కెంగేరి మెట్రో స్టేషన్‌ల మధ్య రైలు సర్వీసుల ఫ్రీక్వెన్సీ ప్రతి 10 నిమిషాలకు అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు.మెట్రోరైలు ప్రయాణికులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాలని అధికారులు సూచించారు.


Updated Date - 2021-09-18T14:22:18+05:30 IST