సిరులు కురిపించే చామంతి

ABN , First Publish Date - 2022-07-02T05:02:52+05:30 IST

పూలసాగులో గులాబి తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట చామం తే. ముఖ్యంగా పండగలు, పర్వదినాలు, సౌం దర్య ఉత్పత్తుల్లోనూ చామంతి పూలకు అధి క ప్రాధాన్యత ఉంది.

సిరులు కురిపించే చామంతి
డ్రిప్‌ ద్వారా సాగుచేసిన చామంతి పంట - అంతర పంటగా సాగుచేసిన చామంతి

ధర స్థిరంగా ఉంటే లక్షల్లో ఆదాయం

యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు

పెండ్లిమర్రి, జూలై 1: పూలసాగులో గులాబి తర్వాతి స్థానం చామంతిదే. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టే పంట చామం తే. ముఖ్యంగా పండగలు, పర్వదినాలు, సౌం దర్య ఉత్పత్తుల్లోనూ చామంతి పూలకు అధి క ప్రాధాన్యత ఉంది. ధర స్థిరంగా ఉంటే రైతుకు లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇది అన్ని రకాల నేలల్లో రైతులు సాగుచే సుకోవ చ్చు. మండలంలో దాదాపు రెండువేల ఎకరా ల్లో చామంతి పూలను సాగుచేస్తారు. ఇందు లో సేంద్రియ పద్ధతుల్లో  కొందరు రైతులు చామంతి పూలను సాగుచేస్తారు. మల్చింగ్‌, డ్రిప్‌, నీటిపారకంతోనూ చామంతి పంటల ను సాగుచేస్తారు. భూమిని బాగా కలియబె ట్టి మొక్కలను రైతులు కలియదున్ని తర్వాత నీటిని సరఫరా చేసి మొక్కలు నాటుతారు.

రైతులు ఈ మొక్కలను తమిళనాడు, కర్ణాట క రాష్ట్రాల నుంచి మొక్కలను దిగుమతి చేసుకుంటుంటారు. ఒక్కో మొక్క రూపా యి నుంచి మూడు రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు 30వేల మొక్కలు నా టుతారు. మల్చింగ్‌ విధానంలో మొక్కలు నా టడం వల్ల కలుపుతీసే సమస్య ఉండదు. ఉద్యానశాఖ అధికారుల సూచనలు, యాజ మాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలు పాటి స్తే తెగుళ్లు, పురుగుల నుంచి పంటలను కా పాడుకుని అధిక దిగుబడి పొందవచ్చు. చా మంతి, నక్షత్ర చామంతి, పసుపు, ఎరుపు, తెలుపు చామంతులు, ఎల్లో గోల్డ్‌, సిల్వర్‌ గోల్డ్‌, రెడ్‌ గోల్డ్‌, కస్తూరి, వాసంతి ఇలా చా లా రకాలను రైతులు సాగుచేస్తున్నారు.

పం ట పూర్తిగా పూలదశ వచ్చే సమయానికి ఎక రాకు 8 నుంచి 10 టన్నుల దిగుబడి వస్తుం ది. ననీ పూలను రైతులు చెన్నై, సేలం, బెం గుళూరు, విజయవాడ, హైదరాబాద్‌, తిరుప తి తదితర పట్టణాలకు పూలను ఎగుమతి చేస్తారు. చెన్నై, బెంగుళూరు నగరాల నుంచి వ్యాపారులు ఇక్కడకు వచ్చి సీజన్‌ అయిపో యే వరకు అక్కడి ధరలను బట్టి కొనుగోలు చేస్తారు. జూన్‌లో మొక్కలు నాటితే నవంబర్‌కు పూలు కోత దశకు వస్తాయి. ఆ సమయంలో పంటను రైతులు కాపాడుకోవా ల్సి వస్తుంది. ధర స్థిరంగా ఉంటే రైతుకు ఇంతకుమించిన ఆదాయం ఏ పంటలోనూ రాదనిచెప్పదవచ్చు.

Updated Date - 2022-07-02T05:02:52+05:30 IST