రక్తదాతలు.. ప్రాణదాతలు

ABN , First Publish Date - 2021-06-18T04:13:16+05:30 IST

రక్తదాతలు.. ప్రాణదాతలు

రక్తదాతలు.. ప్రాణదాతలు
మెగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ 
  • పోలీసుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం


కొత్తూర్‌: రక్తదాతలు ప్రాణదాతలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్‌ అన్నారు. మండల కేంద్రంలోని గణపతి గార్డెన్‌లో గురువారం కొత్తూర్‌ ఇన్‌స్పెక్టర్‌ భూపాల్‌శ్రీధర్‌, నందిగామ, కేశంపేట మండలాల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానానికి మించినది మరోకటి లేదని, పోలీసులు, యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్నవారికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రక్తదానం చేసిన పోలీసులను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. శిబిరంలో దాదాపు రెండు వందల మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జడ్పీ  వైస్‌చైర్మన్‌ ఈటే గణేష్‌, జడ్పీటీసీలు ఎమ్మె శ్రీలతసత్యనారాయణ, తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, ఎంపీపీ పి.మధుసూదన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాతుక లావణ్యదేవేందర్‌యాదవ్‌, వైస్‌చైర్మన్‌ డోలీ రవీందర్‌, షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ సత్యనారాయణ, కొత్తూర్‌, నందిగామ ఇన్‌స్పెక్టర్‌ రామయ్య, ఎస్‌ఐలు సయూద్‌, వెంకటేశ్వర్లు, ధనుంజయ, మహబూబ్‌నగర్‌, హైదారాబాద్‌ జిల్లాల రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్లు డాక్టర్‌ నటరాజ్‌, మామిడి భీంరెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంబటి ప్రభాకర్‌, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సంతో్‌షనాయక్‌, యువసత్తా యూత్‌ అధ్యక్షుడు లక్ష్మణ్‌కుమార్‌, నాయకులు పెంటనోళ్ల యాదగిరి, విఠల్‌ ముదిరాజ్‌, గోల్లపల్లి అశోక్‌, బాలయ్యయాదవ్‌, తదితరులు పాల్గొన్నారు. 

నియంత్రిత సాగుపై అవగాహన కల్పించాలి

కొందుర్గు: నియంత్రిత సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ సూచించారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఐకేపీ సమావేశపు మందిరంలో ఎంపీపీ పోతురాజు జంగయ్య అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు వరి పంటను ఎక్కువగా సాగు చేశారని, దీని కారణంగా కోనుగోలు కేంద్రాల్లో ఇబ్బందుల ఏర్పాడ్డాయన్నారు. ఫరుఖ్‌నగర్‌ మండల పరిధి దేవునిపల్లిలో ఒక్క ఆవుతో ఓ రైతు 30 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాడని, ఈ దిశగా రైతులు అలవర్చుకోవాలని కోరారు. అంతకుముందు పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులను పలు సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. అభివృద్ధి పనులకు మొరం తరలింపును అధికారులు అడ్డుకుంటున్నారని, ఇలాగైతే పనులు చేయలేమని సర్పంచులు వాపోయారు. మొరం తెచ్చుకునేందుకు ఎంపీవో ద్వారా అనుమతి తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో జడ్పీటీసీ ఎదిరే రాగమ్మ, వైస్‌ ఎంపీపీ రాజే్‌షపటేల్‌, పీఏసీఎస్‌ చైర్మెన్‌ దామోదర్‌రెడ్డి, ఎంపీడీవో అంజనేయులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-18T04:13:16+05:30 IST