వ్యాక్సినేషన్‌ తర్వాత 14 రోజులకు రక్తదానం

ABN , First Publish Date - 2021-05-06T08:00:42+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తి రక్తదానం చేసేందుకు తీసుకోవాల్సిన కనీస సమయాన్ని కేంద్రం సవరించింది. ఇప్పటివరకు 28 రోజులుగా ఉన్న ఈ సమయాన్ని 14 రోజులకు కుదించింది...

వ్యాక్సినేషన్‌ తర్వాత 14 రోజులకు రక్తదానం

  • కనీస కాలపరిమితిని తగ్గించిన కేంద్రం

న్యూఢిల్లీ, మే 5: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తి రక్తదానం చేసేందుకు తీసుకోవాల్సిన కనీస సమయాన్ని కేంద్రం సవరించింది. ఇప్పటివరకు 28 రోజులుగా ఉన్న ఈ సమయాన్ని 14 రోజులకు కుదించింది. 18 ఏళ్లు నిండిన వాళ్లందరికీ వ్యాక్సిన్‌ అందించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంతో దేశంలో రక్త సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకూడదనే ఉద్దేశంతో నిపుణుల సూచనలతోనే ఈ సవరణ చేసినట్లు పేర్కొంది. 


Updated Date - 2021-05-06T08:00:42+05:30 IST