కరోనాతో ప్రతి అవయవంలో బ్లడ్‌ క్లాట్‌

ABN , First Publish Date - 2020-07-12T07:28:33+05:30 IST

కరోనాతో మరణించిన వారిలో రక్తం గడ్డ కట్టడమనేది శరీరంలోని ప్రతి అవయవంలో కనిపించినట్లు న్యూయార్క్‌ యూనివర్సిటీ పాథాలజిస్ట్‌ అమీ రాప్‌కీవిజ్‌ తెలిపారు...

కరోనాతో ప్రతి అవయవంలో బ్లడ్‌ క్లాట్‌

న్యూయార్క్‌, జూలై 11: కరోనాతో మరణించిన వారిలో రక్తం గడ్డ కట్టడమనేది శరీరంలోని ప్రతి అవయవంలో కనిపించినట్లు న్యూయార్క్‌ యూనివర్సిటీ పాథాలజిస్ట్‌ అమీ రాప్‌కీవిజ్‌ తెలిపారు. గుండె, కిడ్నీ, కాలేయంతోపాటు ముఖ్యంగా గుండె, పెద్ద ఎముక మజ్జా కణాల్లో గడ్డ కట్టడం ప్రధానంగా కనిపించిందని తెలిపారు. గతంలో కరోనాతో పెద్ద రక్త కణాలు, ఊపిరితిత్తులు, గుండె, మెదడు వంటి భాగాల్లో మాత్రమే రక్తం గడ్డ కట్టడం జరుగుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. తాజా అధ్యయనం చిన్న రక్త కణాల్లో కూడా రక్త గడ్డ కట్టే విషయాన్ని నిర్ధారించిందని రాప్‌కీవిజ్‌ తెలిపారు. దీని వల్ల స్ర్టోక్‌ రావడం, కిడ్నీ, రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు.


Updated Date - 2020-07-12T07:28:33+05:30 IST