ప్రైవేటు ఆస్పత్రులకూ ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2020-12-03T06:26:22+05:30 IST

జిల్లా సర్వజనాస్పత్రిలో సేకరిస్తున్న ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ ఇక బయటి ఆస్పత్రులకూ అందజేయనున్నారు.

ప్రైవేటు ఆస్పత్రులకూ ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌

సర్వజనాస్పత్రి నుంచి సరఫరాకు కలెక్టర్‌ అనుమతి

బయటి వారికి ప్లాస్మా రూ.8500.. ప్లేట్‌లెట్స్‌ రూ.8000..

నేటి నుంచి అందుబాటులోకి..


అనంతపురం వైద్యం, డిసెంబరు 2: జిల్లా సర్వజనాస్పత్రిలో సేకరిస్తున్న ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ ఇక బయటి ఆస్పత్రులకూ అందజేయనున్నారు. నెల రోజుల క్రితం  ఆస్పత్రిలో ప్లాస్మా సేకరణకు ఏర్పాటు చేసిన అధునాతన యంత్రాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ప్లా స్మా సరఫరాపై నిర్ణయం తీసుకోకపోవటంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ గంధం చంద్రుడు.. దీనిపై క్లారిటీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారి నుంచి సేకరిస్తున్న ప్లాస్మా బయట ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరో నా బాధితులకు అందజేయనున్నారు. జిల్లా సర్వజనాస్పత్రిలో చికిత్స పొందేవారికి మార తం ఉచితంగా ఇవ్వనున్నారు. బయట ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు యూనిట్‌ ప్లాస్మా కు రూ.8500 చెల్లించాల్సి ఉంటుంది. డెంగ్యూ తో ప్లేట్‌లెట్స్‌ పడిపోయి ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు.. సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌కు యూనిట్‌కు రూ.8000 చెల్లించాల్సి ఉంటుంది. బయట ప్లాస్మాకు రూ.12 వేల నుంచి రూ.15 వేలు, సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌కు రూ.11 వేల వరకు తీసుకుంటున్నారు. ప్రజలకు తక్కువ ధరలో అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.  అవసరమైన వారు చికిత్స అందిస్తున్న ఆయా ఆస్పత్రుల వైద్యుల నుంచి రిక్విజిషన్‌ ఫారంతోపాటు బ్లడ్‌ శాంపిల్‌ తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. సింగిల్‌ డోనర్‌ ప్లేట్‌లెట్స్‌ కావాల్సిన వారు అదే బ్లడ్‌ గ్రూప్‌ కలిగి ఆరోగ్యంగా ఉన్న రక్త దాతను తీసుకు రావాల్సి ఉంటుందన్నారు. గురువారం నుంచి ప్లాస్మా, ప్లేట్‌లెట్స్‌ పొందవచ్చని కలెక్టర్‌ తెలిపారు.



Updated Date - 2020-12-03T06:26:22+05:30 IST