ఈ 5 మూఢనమ్మకాలు మీలో ఉన్నాయా? వీటి వెనుకనున్న అసలు సంగతి తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-12-25T17:45:51+05:30 IST

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వింతైన మూఢనమ్మకాలు..

ఈ 5 మూఢనమ్మకాలు మీలో ఉన్నాయా? వీటి వెనుకనున్న అసలు సంగతి తెలిస్తే షాకవుతారు!

మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో వింతైన మూఢనమ్మకాలు నెలకొన్నాయి. నిమ్మకాయలు గుమ్మానికి వేలాడదీయడం, పామును చంపాక దాని తల నరికివేయడం, రాత్రిపూట గోళ్లు కత్తిరించవద్దనడం లాంటి మాటలు మనం వినేవుంటాం. మన పూర్వీకులు నమ్మిన ఈ ఆచారాలు, నమ్మకాల వెనుక సైన్స్ ఉందని మీకు తెలుసా? అవును.. ప్రతి మూఢనమ్మకం వెనుక ఒక శాస్త్రీయ వాస్తవం దాగి ఉంది. వాటిలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం. 


1. పామును చంపి, దాని తల నరికివేయడం

దేశంలో పాములకు సంబంధించి ఎన్నో అపోహలు, నమ్మకాలు ఉన్నాయి. పామును చంపిన వ్యక్తి రూపం ఆ పాము కళ్లలో పడుతుందంటారు. అందుకే పామును చంపినవారు దాని తలను నరికివేస్తుంటారు. ఈ మూఢనమ్మకం వెనుక ఒక లాజిక్ ఉంది. పాము చనిపోయిన తర్వాత కూడా దాని విషం మనుషులను హానికరమవుతుంది. అందుకే దాని తలను నరికి పాతి పెడతారు. నిజానికి జంతు హింస అనేది నేరం. పాము కనిపించినప్పుడు, పాములు పట్టేవారికో లేదా అటవీశాఖ అధికారులతో తెలియజేయాలి. అప్పుడు వారు పామును పట్టుకోగలుగుతారు. అంతేకానీ పామును చంపకూడదు. 

2. గ్రహణ సమయంలో బయటకు రాకపోవడం

మన పెద్దలు గ్రహణ సమయంలో మనల్ని బయటకు వెళ్లనివ్వరు. ఆ సమయంలో దుష్ట శక్తులు బయట తిరుగుతుంటాయిని వారు చెబుతుంటారు. అయితే దీని వెనుక ఉన్న నిజం ఏమిటంటే.. గ్రహణ సమయంలో సూర్యుని కిరణాలు మన చర్మానికి తాకితే హాని కలుగుతుంది. చర్మవ్యాధులు వస్తాయి. అదేవిధంగా సూర్య గ్రహణాన్ని కంటితో చూడటం వలన చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. 


3. మంగళవారం, గురువారం తల స్నానం వద్దు

చాలా మంది మహిళలు మంగళ, గురువారాల్లో తల స్నానం చేయరు. గతంలో ఆయారోజుల్లో తల స్నానం చేయడం మంచిది కాదని చెప్పేవారు. పురాతన కాలంలోని ప్రజలు తమ ఇళ్లలో నీటిని నిల్వ చేసుకునేవారు. రోజూ తల స్నానం చేస్తే అధికంగా నీరు వినియోగించాల్సివస్తుంది. తల స్నానం పేరుతో అధికంగా అయ్యే నీటి వృథాను నివారించేందుకే ఈ ఆచారాన్ని అమలు చేశారు. 

4. రాత్రిపూట గోళ్లు కత్తిరించడం 

రాత్రిపూట గోళ్లు కత్తిరించకూడదని, అలా చేయడం వలన మనపై చెడు ప్రభావం పడుతుందని ప్రజల్లో ఎప్పటి నుంచో ఒక మూఢనమ్మకం ఉంది. దీనివెనుక ఒక కారణం కూడా ఉంది. పూర్వకాలంలో విద్యుత్ లేకపోవడంతో రాత్రిపూట గోళ్లు కత్తిరించేవారు కాదు. అప్పట్లో గోళ్లను కత్తిరించేందుకు వివిధ పనిముట్లను ఉపయోగించేవారు. వాటి సాయంతో చీకట్లో గోళ్లు కత్తిరిస్తే వేళ్లు కోసుకుపోయే ప్రమాదం ఏర్పడుతుండేది.

5. గుమ్మానికి నిమ్మకాయలు కట్టడం

చాలామంది తమ ఇంటి గుమ్మాలకు నిమ్మకాయలను వేలాడదీయడాన్ని చూస్తుంటాం. ఇలా చేయడం ద్వారా దుష్టశక్తుల నీడ ఇంటిలో పడదని నమ్మేవారు. అయితే దీని వెనుకనున్న అసలు లాజిక్ ఏమిటంటే.. నిమ్మకాయలలో సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల.. అది ఇంట్లోకి క్రిములు, కీటకాలు రాకుండా కాపాడుతుంది.

Updated Date - 2021-12-25T17:45:51+05:30 IST