వరమివ్వు.. మహాలక్ష్మీ

ABN , First Publish Date - 2022-08-06T05:54:54+05:30 IST

శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించారు.

వరమివ్వు.. మహాలక్ష్మీ
శంకరమఠంలో ప్రత్యేక అలంకరణలో దర్శనమిస్తున్న శారదామాత

శ్రావణమాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతపురం నగరంలోని అమ్మవారి ఆలయాల్లో మహిళలు సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు. శారదానగర్‌లోని శృంగేరి శంకరమఠంలో శారదామాతకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి, పూజించారు. 

- అనంతపురం కల్చరల్‌

Updated Date - 2022-08-06T05:54:54+05:30 IST