BJP Yuva Morcha Praveen Nettaru case: ఎన్ఐఏకు అప్పగించిన కర్ణాటక సీఎం

ABN , First Publish Date - 2022-07-29T21:11:27+05:30 IST

బెంగళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు (BJP Yuva Morcha worker Praveen Nettaru) హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA)కు అప్పగించారు.

BJP Yuva Morcha Praveen Nettaru case: ఎన్ఐఏకు అప్పగించిన కర్ణాటక సీఎం

బెంగళూరు: బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు (BJP Yuva Morcha worker Praveen Nettaru) హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ (NIA)కు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం నిన్న హామీ ఇచ్చారు. అంతే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం (Yogi model) తాము కూడా అమలు చేస్తామన్నారు. యూపీలో అల్లర్లకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానాన్ని పరిస్థితులను బట్టి కర్ణాటకలో కూడా అమలు చేస్తామని బొమ్మై చెప్పారు.



మరోవైపు ఈ హత్య కేసులో కేరళ రాష్ట్రం కాసరగోడులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మంగళవారం రాత్రి సుళ్య తాలూకాలో ప్రవీణ్‌ నెట్టారు హత్య జరిగిన వెంటనే ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ పర్యవేక్షణలో ఆరు ప్రత్యేక బృందాలు హంతకుల వేట చేపట్టాయి. హత్య కేసులో ప్రధాన సూత్రధారులుగా భావిస్తున్న షఫీక్‌ బెళ్లారె, జాకీర్‌ సవణూరును కేరళ రాష్ట్రం కాసరగోడు పట్టణంలో అరెస్టు చేసినట్లు ఏడీజీపీ అలోక్‌ కుమార్‌ బెంగళూరులో ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటిదాకా 21 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. 


ప్రవీణ్‌ నెట్టారు హత్య పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పనేనని, ఆ సంస్థను నిషేధించాలంటూ తాము కేంద్రానికి నివేదిస్తామని సీఎం బొమ్మై చెప్పారు. 

Updated Date - 2022-07-29T21:11:27+05:30 IST