ఓట్ల కోసం స్టాలిన్‌ పగటి వేషం

ABN , First Publish Date - 2021-01-25T11:45:05+05:30 IST

రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగ నున్న దృష్ట్యా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పగటి వేషాలు వేస్తున్నా రని తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు మురుగన్‌

ఓట్ల కోసం స్టాలిన్‌ పగటి వేషం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్‌

చెన్నై/అడయార్‌ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగ నున్న దృష్ట్యా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ పగటి వేషాలు వేస్తున్నా రని తమిళనాడు రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు మురుగన్‌ ఆరోపించారు. సేలంలో ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్య క్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురుగన్‌ మాట్లాడుతూ, బీజేపీ చేపట్టిన విజయయాత్ర విజయవంతమైందన్నారు. అదేసమయంలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌  శూలాయుధం చేతిలో ధరించడం ఎన్నికల జిమ్మిక్కు అని, ఓట్ల కోసం స్టాలిన్‌ వేసిన పగటి వేషం అని విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాష్ట్రంలో చేపట్టిన ప్రచారం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. అలాగే, డీఎంకే కూటమి ఏ క్షణమైనా కూలిపోయేందుకు ఆస్కారం ఉందని మురుగన్‌ జోస్యం చెప్పారు.

Updated Date - 2021-01-25T11:45:05+05:30 IST