బెంగళూరు(Karnataka): బీజేపీ రాష్ట్రకార్యవర్గ సమావేశాలు డిసెంబరు 18, 19 తేదీలలో హుబ్బళ్ళిలో జరగనున్నాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి కేప్టెన్ గణేశ్ కార్నిక్ నగరంలో బుధవారం మీడియాకు చెప్పారు. స్థానిక సంస్థల కోటా నుంచి విధానపరిషత్‌కు డిసెంబరు 10న జరగనున్న ఎన్నికలకు సంబంధించి మరో మూడు రోజుల్లో పార్టీ అభ్యర్థుల జాబితాను అధిష్ఠానం పరిశీలనకు పంపుతామన్నారు. టికెట్‌ల కేటాయింపులో అధిష్ఠానం పెద్దలదే తుది నిర్ణయమన్నారు. ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ అభివృద్ధి అజెండాయే ప్రధాన ప్రచారాస్త్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.