మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులు

ABN , First Publish Date - 2022-07-04T05:14:54+05:30 IST

హైదరాబాద్‌లో బీజేపీ తలపెట్టిన విజయ్‌సంకల్ప్‌ మోదీ సభకు సంగారెడ్డి జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సంగారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయం, గణేశ్‌ గడ్డ నుంచి అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో భారీ వాహన శ్రేణితో భాగ్యనగరానికి పయనమయ్యారు.

మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులు
మెదక్‌లో

సంగారెడ్డిఅర్బన్‌, జూలై3: హైదరాబాద్‌లో బీజేపీ తలపెట్టిన విజయ్‌సంకల్ప్‌ మోదీ సభకు సంగారెడ్డి జిల్లా నుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. సంగారెడ్డిలోని పార్టీ జిల్లా కార్యాలయం, గణేశ్‌ గడ్డ నుంచి అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే ఆధ్వర్యంలో పెద్దసంఖ్యలో భారీ వాహన శ్రేణితో భాగ్యనగరానికి పయనమయ్యారు. జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, పటాన్‌చెరు, అందోల్‌ నియోజకవర్గాల నుంచి ఆయా అసెంబ్లీ ఇన్‌చార్జుల ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీగా సభకు తరలివెళ్లారు. డప్పు చప్పులు వాయించి ఫుల్‌ జోష్‌తో సభకు బయలు దేరారు. ఈ సందర్బంగా సంగారెడ్డి అసెంబ్లీ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ టీఆర్‌ఎ్‌సను బొంద పెట్టేది బీజేపీనే అన్నారు. ప్రతి నియోజకవర్గం నుంచి పది వేల మంది తరలించామన్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విష్ణువర్థన్‌రెడ్డి, చంద్రశేఖర్‌, జగన్‌, సంగమేశ్వర్‌, నర్సారెడ్డి, హన్మంత్‌రెడ్డి, డాక్టర్‌ రాజుగౌడ్‌, వాసు, రవిశంకర్‌, సాయికుమార్‌, అశ్వంత్‌, అంబదాస్‌, నర్సింహరెడ్డి, ఆంజనేయులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

మెదక్‌ టూ సికింద్రాబాద్‌..

మెదక్‌ అర్బన్‌, జూలై 3: సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు మెదక్‌ జిల్లానుంచి బీజేపీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ప్రైవేటు బస్సులు, వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనం కదిలారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో మెదక్‌ జిల్లా నుంచి దాదాపు 10వేల మంది సికింద్రాబాద్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌ మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. సభకు తరలిన వారిలో జిల్లా ప్రధాన కార్యదదర్శులు విజయ్‌, సుధాకర్‌రెడ్డి, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షరాలు వీణ, జిల్లా నాయకులు మధు, నాగరాజు, సుభాష్‌గౌడ్‌, కాశీనాథ్‌, ఎంఎల్‌ఎన్‌ రెడ్డి, జనార్ధన్‌,  పట్టణ అధ్యక్షులు ప్రసాద్‌, రాము, లోకేష్‌, మల్లేశం, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ, వివిధ మండలాల అధ్యక్షుల, ప్రభాకర్‌, అంజనేయులతోపాటు వివిధ మోర్చా జిల్లా అఽధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు. 



Updated Date - 2022-07-04T05:14:54+05:30 IST