సుబ్బరత్నంను సన్మానిస్తున్న నాయకులు
ఉదయగిరి రూరల్, జనవరి 27: మండల బీజేపీ గౌరవా ధ్యక్షుడిగా చల్లా సుబ్బరత్నంను ఏకగ్రీవంగా ఎంపిక చేశా రు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పదాధికారుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గెట్టిబోయిన వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆయన్ను ఎంపిక చేశారు. అనంతరం సుబ్బరత్నం మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. అనంతరం నాయకులు ఆయన్ను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోశయ్యయాదవ్, రాజశేఖర్, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లగుప్తా, సాయి, ఖయ్యూం, దుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.
-------