Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

రాష్ట్రంలో రూలింగ్‌ లేదు... ట్రేడింగ్‌ చేస్తున్నారు

twitter-iconwatsapp-iconfb-icon
రాష్ట్రంలో రూలింగ్‌ లేదు... ట్రేడింగ్‌ చేస్తున్నారు

ప్రభుత్వ మతతత్వ ఆలోచన 

విధానాలకు వ్యతిరేకంగా... 

 22న 175 నియోజకవర్గాల్లో 

ప్రజానిరసన సభలు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు

అనంతపురం, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో వైసీపీ పాలకులు రూలింగ్‌ చేయకుండా... కేవలం ట్రేడింగ్‌ చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. ఈ మేరకు గురువారం అనంతపురం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రజా సమస్యలు గాలికొదిలేసి కేవలం ఇసుక, మట్టి, గనులు ఇతరత్రా వనరులను సొంత ఆస్తులుగా భావించి అమ్ముకుంటున్నారని వై సీపీ పాలకులపై ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వస్తే... గనులను జాతీయం చేస్తామన్నారు. విదేశాల నుంచి వస్తున్న బంగారాన్ని కొనుగోలు చేసి అప్పటికప్పుడే బయటకు వ స్తున్నా... పక్కనున్న ఇసుకను ఇంటికి తీసుకురావాలంటే... అనేక ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వమేదైనా ఉందంటే అది వైసీపీనేనన్నారు. తాము అధికారంలోకి వస్తే... ట్రాన్సపోర్టుతో స హా చౌకగా ఇసుకను ఇంటికి చేరుస్తామన్నారు. ప్రజల కష్టాలను తీర్చడంలో టీడీపీ, వైసీపీలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దిగజారడంతో పాటు... పారిశ్రామిక అభివృద్ధిలేని, రాజధానిలేని రాష్ట్రమేదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రమేనన్నారు. పోలవరం నిర్మాణానికి నిధులిస్తారా..? లేదా..? అని ప్రశ్నించే పాలకులు తెలుగుగంగ, గాలేరు నగరి ప్రాజెక్టులు ఈ పాలకులకు పట్టవా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో మరో దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందన్నారు. ఆ రెండు కుటుంబ పార్టీ లు ఎవరు అధికారంలో ఉంటే వారు గనులు, ఇసుక, సిమెంటు, ఎర్రచందనం, ముగ్గు, పలకరాయి తదితర ఖనిజ సంపదను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో రూ. 65 వేల కోట్ల తో రైల్వే నిర్మాణ పనులు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వాటా నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఇవ్వకున్నా... కాళహస్తి, నడికుడి, అమలాపురం-రాజోలు, కాకినాడ వరకూ పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఎయిర్‌పోర్టులను అభివృద్ధిచేస్తుంటే... ముఖ్యమంత్రి వైఎస్‌ జగన ఆర్టీసీ బస్టాండ్‌లను తా కట్టు పెడుతుండటం దారుణమన్నారు. రాష్ట్ర ంలో రోడ్లలో గుంతలు పూడ్చుకోలేని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నా... కేంద్ర ప్రభుత్వం చొరవతో రాష్ట్రంలో నాలుగులేన్ల హైవేల నిర్మాణం జరుగుతోందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం వేల కోట్లు నిధులిస్తే... ఆ నిధులను సర్పంచల నుంచి వెనక్కు తీసుకున్న ఘ నత సీఎంకే దక్కిందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా... వాటిని రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు గొప్పలు పోవడంతోనే ఈ ప్రభుత్వం సరిపెట్టుకుంటోందని ఎద్దేవ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వం మతతత్వ ఆలోచనా విధానాలతో ముందుకెళ్తోందని మండిపడ్డారు. ఈ సందర్భంగా కర్నూలులో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ మతతత్వ ఆలోచనా విధానాలను వ్యతిరేకిస్తూ... ఈ నెల 22న రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఆ నిరసన సభల్లో ప్రభుత్వ, ప్రజా, మతతత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతామన్నారు.


రాయలసీమ అభివృద్ధే బీజేపీ ధ్యేయం

అనంతపురం అర్బన, జనవరి 20: రాయలసీమ ప్రాంత అభివృద్ధే బీజేపీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. గురువారం ఓ ప్రైవేటు హోటల్‌లో బీజేపీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. సోము వీర్రాజుతోపాటు రాష్ట్ర ప్రధానకార్యదర్శి వి ష్ణువర్ధనరెడ్డి, కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అధికార ప్రతిధిని వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. సోమువీర్రాజు మాట్లాడుతూ రాయలసీమలో అపారమైన గనులు, ఇసుక, సిమెంట్‌, ఎర్రచందనం, ముగ్గు, పలకరాయి వంటి అనేక వనరులన్నాయన్నారు. పారిశ్రామిక అభివృద్ధికి తగిన భూములున్నాయన్నారు. వాటిని రెండు కుటుంబ పార్టీలు సొంతం చేసుకుని, ఎవరు అధికారంలోకి వస్తే వారు అమ్ముకుంటున్నారన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రవేశపెట్టిన సర్వశిక్షా అభియాన ద్వారా పిల్లలకు స్కూల్‌బ్యాగ్‌, పుస్తకాలు, ఽమధ్యాహ్న బోజనం, యూనిఫాం కేంద్రం ఇస్తుందన్నారు. సర్వశిక్షా అభియాన నిధులన్నీ నాడు-నేడు పథకం పేరుతో వినియోగిస్తున్నారన్నారు. 104 వంటి వైద్యసేవల వాహనాలు రూరల్‌ హెల్త్‌మిషన ద్వారా ఇస్తున్నామన్నారు. రూ.40 అమ్మవలసిన సన్నబియ్యాన్ని రూ.52కి అమ్ముతున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.1400 ఇస్తామన్నారు. అనంతపురం, కర్నూలులో సన్నధ్యాన్యాన్ని రూ.1500కి కొనుగోలు చేస్తామన్నారు. సిమెంటు బస్తాను రూ.380 ఎలా అమ్ముతారని సీఎం జగనను ప్రశ్నిస్తున్నానన్నారు. ఏటా కోటి మొక్కలను నాటుతున్నామని ప్రకటనలు చేస్తున్న వైసీపీ.. అవన్నీ ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ అందిస్తున్న పథకాలపై వీధివీధినా దండోరా వేసి, ప్రచారం చేస్తామన్నారు. అందుకు ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకుడు కొనకొండ్ల రాజేష్‌, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.