Abn logo
Sep 22 2020 @ 11:24AM

మంత్రి కొడాలి వ్యాఖ్యలపై.. ఆగ్రహ జ్వాల

Kaakateeya

పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

దేవుళ్లను కించపరిస్తే సహించేది లేదంటూ హెచ్చరిక


గుంటూరు (ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్)‌: హిందూ దేవుళ్లపై మంత్రి కొడాలి వెంకటేశ్వర్లు(నాని) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యా యి. పలుచోట్ల బీజేపీ నేతలు నానిపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేశారు. హిందూ మతవిశ్వాసాలను అగౌరవపరుస్తూ, దేవుళ్లను కించపరుస్తూ రెచ్చగొట్టే విధంగా నాని చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని కోరారు. తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు షేక్‌ ఖాజా అలీ ఆధ్వర్యంలో సీతానగరం వద్ద వున్న ఆంజనేయస్వామి విగ్రహానికి పాలాభిషేకం చేసి వినతిపత్రం అందించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో నేతలు ఫిర్యాదు చేశారు. కొడాలి నానికి మంచి బుద్ధి ప్రసాదించాలని బీజేపీ నాయకులు చిలకలూరిపేట పట్టణంలోని చౌత్రాసెంటర్‌లోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచారు. బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. హిందూ మత విశ్వాసాలను అగౌరవ పరచిన కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాపట్లలో బీజేపీ పార్లమెం టు నియోజకవర్గ అధ్యక్షుడు కంచర్ల హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎ.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు.


కర్లపాలెం, క్రోసూరు పోలీస్‌ స్టేషన్లలో బీజేపీ, జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. క్రోసూరులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. వినుకొండ పోలీస్‌ స్టేషన్‌లో బీజేపీ నేతలు మంత్రిపై ఫిర్యాదు చేశారు. తొలుత గుంటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి వినతిపత్రం అందించారు. నరసరావుపేట పట్టణంలోని 2టౌన్‌ పోలీసుస్టేషన్‌లో పట్ణణ బీజేపీ అధ్యక్షుడు రంగిశెట్టి రామకృష్ణ ఫిర్యాదు చేశారు. హిందూ దేవాల యాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా టీడీపీ నాయకులు సత్తెనపల్లిలోని వేంకటేశ్వ రస్వామి ఆలయం వద్ద నిరసన వ్యక్తం  చేశారు.  తెలుగు యువత రాష్ట్ర నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ మంత్రి   నానికి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. నానిపై చట్టపరంగా చర్యలు తీసు కోవాలని బీజేపీ నాయకులు పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.


మంత్రి కొడాలి నానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో  ఏటుకూరు రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహానికి వినతిపత్రం అందించారు. దేవతామూర్తులపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీసుస్టేషనులో ఫిర్యాదు చేశారు.  నానిపై  295, 295ఎ, 153ఎ, సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. జూపూడి రంగరాజు, మాగంటి సుఽధాకర్‌ యాదవ్‌, అమ్మిశెట్టి ఆంజనేయులు, తోట రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


మంత్రి నాని చేస్తున్న వాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని, ఆ వాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు, అర్చక సమాఖ్య నాయకులు జంధ్యాల వెంకట రామలింగేశ్వరశాస్ర్తి డిమాండ్‌ చేశారు. హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా మంత్రి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.  మత విద్వేషాలు వైసీపీ, బీజేపీ కుట్రే


బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌

రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న మత విద్వేషాలు వైసీపీ, బీజేపీ కుట్ర రాజకీయాల్లో భాగమేనని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ ధ్వజమెత్తారు. గుంటూరులో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దానిలో భాగంగా అంతర్వేదిలో రథం దగ్ధం,  టీటీడీ డిక్లరేషన్‌ వ్యవహారం తెరమీదకు వచ్చాయన్నారు. మంత్రి కొడాలి నాని ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల ఆరాధ్య దైవమైన తిరుమల వేంకటేశ్వరస్వామిపై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తు న్నామన్నారు. సీఎం జగన్‌ క్రైస్తవ మతస్థుడై ఉండి హిందూ మత విశ్వాసాలపై డిక్లరేషన్‌ ఇవ్వకుండా ఉండటం అంటే తిరుమల పవిత్రతను అపవిత్రం చేసినట్టేనన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా తిరుమల దర్శనానికి జగన్‌ చెప్పులతో వెళ్ళి హిందూ మనోభావాలను దెబ్బ తీశాడన్నారు. సంప్రదాయం ప్రకారం సీఎం జగన్‌ తన భార్యతో కలసి పట్టువస్త్రాలు సమర్పిస్తారా అని ప్రశ్నించారు. 

Advertisement
Advertisement