Stalin వచ్చినా ఆహ్వానిస్తాం

ABN , First Publish Date - 2022-06-04T15:28:14+05:30 IST

ముఖ్యమంత్రి స్టాలిన్‌ వచ్చినా బీజేపీ సాదరంగా ఆహ్వానిస్తుందని మాజీ ఎంపీ రామలింగం అన్నారు. నామక్కల్‌ జిల్లా రాశిపురంలో శుక్రవారం ఆయన మీడియాతో

Stalin వచ్చినా ఆహ్వానిస్తాం

                              - బీజేపీ నేత రామలింగం


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 3: ముఖ్యమంత్రి స్టాలిన్‌ వచ్చినా బీజేపీ సాదరంగా ఆహ్వానిస్తుందని మాజీ ఎంపీ రామలింగం అన్నారు. నామక్కల్‌ జిల్లా రాశిపురంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ 8 ఏళ్ల పాలనలో దేశంలో 80 ఏళ్ల ప్రగతి సాధించిందన్నారు. కరోనా వైర్‌సతో మృతిచెందిన వారి పిల్లలకు నెలకు రూ.4 వేలు అందించే మంచి పథకాన్ని ప్రధాని ప్రారంభించడంపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయన్నారు. అన్నాడీఎంకే అసమ్మతివర్గం నాయకురాలు శశికళ మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక భావాలు కలిగిన సతీమణి మాటలు విని ముఖ్యమంత్రి స్టాలిన్‌ వచ్చినా బీజేపీ సాదరంగా ఆహ్వాస్తుందని రామలింగం తెలిపారు. కాగా, దీర్ఘకాలంగా డీఎంకేలో కొనసాగిన రామలింగం కొద్ది నెలల క్రితమే బీజేపీ తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.

Updated Date - 2022-06-04T15:28:14+05:30 IST