Telangana: TRSలో ఉద్యమకారులకు చోటు లేదు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

ABN , First Publish Date - 2022-05-19T22:00:59+05:30 IST

టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు చోటు లేదని BJP సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాజ్యసభ సభ్యల ఎంపికతో ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదను రుజువైందన్నారు. పన్ను

Telangana: TRSలో ఉద్యమకారులకు చోటు లేదు: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Hyderabad: టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు చోటు లేదని BJP సీనియర్ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. రాజ్యసభ సభ్యల ఎంపికతో ఉద్యమకారులకు టీఆర్ఎస్‌లో స్థానం లేదను రుజువైందన్నారు. పన్ను ఎగవేత దారులకు రాజ్యసభ సిటు కేటాయించడం సిగ్గు చేటు అని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఇచ్చే నిధులతో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా పేదలకు కేంద్రం ఉపాధి చూపిస్తుంటే.. కమిషన్‌లు రావడంలేదని ఆ పథకాన్ని కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం గాడి తప్పిందన్నారు. ఇంటింటికీ బీరు, వీధికో  బారు, ఇదే కేసీఆర్ దర్బార్ అనే తరహాలో కేసీఆర్ పాలన సాగుతుందని విమర్శించారు. వచ్చే నెల ప్రభుత్వం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, ఆర్థిక పరిస్థితిపై శ్వేతా పత్రం విడుదల చేయాలి ప్రభాకర్ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-05-19T22:00:59+05:30 IST