viral video: మోదీ కాన్వాయ్ వద్ద బీజేపీ జెండాలు, నినాదాలు

ABN , First Publish Date - 2022-01-07T21:15:42+05:30 IST

భద్రతా వైఫల్యం వల్ల పంజాబ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరిగి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. బటిండాకు సమీపంలో ఓ ఫ్లైఓవర్ వద్ద మోదీ కాన్వాయ్ నిలిచిపోయింది. కొంత మంది నిరసనకారులు తన కాన్వాయ్‌ని నిలిపివేసినట్లు స్వయంగా మోదీనే వెల్లడించారు..

viral video: మోదీ కాన్వాయ్ వద్ద బీజేపీ జెండాలు, నినాదాలు

చండీగఢ్: భద్రతా వైఫల్యం వల్ల పంజాబ్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తిరిగి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే. బటిండాకు సమీపంలో ఓ ఫ్లైఓవర్ వద్ద మోదీ కాన్వాయ్ నిలిచిపోయింది. కొంత మంది నిరసనకారులు తన కాన్వాయ్‌ని నిలిపివేసినట్లు స్వయంగా మోదీనే వెల్లడించారు. అయితే ఈ సమయంలో కొంత మంది మోదీ కాన్వాయ్‌కి సమీపంలో భారతీయ జనతా పార్టీ జెండాలు పట్టుకుని, మోదీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాస్తవానికి మోదీని ఎన్నికల ర్యాలీలో పాల్గొనకూడదని కాంగ్రెస్ సహా కొంత మంది కుట్రపన్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో ఈ వీడియో బయటికి రావడం విశేషం.


సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుని ఉన్నారు. పదుల సంఖ్యలో ఉన్న సమూహం ‘నరేంద్రమోదీ జిందాబాద్’ అంటూ నినాదాలు చేస్తోంది. మోదీకి అత్యంత సమీపంలో వీళ్లు మాత్రమే కనిపించడం గమనార్హం. కాగా, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భద్రతా కారణాలో, నిరసనలో మోదీని ఆపలేదని దానికి ఈ వీడియోనే సాక్ష్యం అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భద్రతా కారణాలను బూచీగా చూపి మోదీ వెనక్కి వెళ్లారని, వాస్తవానికి ఆయన వెనక్కి వెళ్లడానికి కారణం బీజేపీ నిర్వహించబోయే సభకు ఎవరూ రాకపోవడమే మరికొందరు విమర్శిస్తున్నారు. మరోవైపు పంజాబ్ ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వద్ద భద్రతపరచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.


నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్న ట్వీట్లలో కొన్ని..









Updated Date - 2022-01-07T21:15:42+05:30 IST