మహారాష్ట్రలో హిందువులను విభజించేందుకు బీజేపీ కుట్ర:CM Uddhav Thackeray

ABN , First Publish Date - 2022-05-01T01:02:32+05:30 IST

మహారాష్ట్రలో హిందువులను విభజించేందుకు బీజేపీ కుట్ర:CM Uddhav Thackeray

మహారాష్ట్రలో హిందువులను విభజించేందుకు బీజేపీ కుట్ర:CM Uddhav Thackeray

ముంబై: బీజేపీపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివ సేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో హిందువులను విభజించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. కొంకణ్ ప్రాంతం, పశ్చిమ ప్రాంతాల శివసేన జిల్లా చీఫ్‌లను ఉద్దేశించి ఆన్‌లైన్ ద్వారా ఠాక్రే ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పేరు చెప్పకుండా మహారాష్ట్రను "హిందూ వ్యతిరేక"గా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తోందని థాకరే ఆరోపించారు. 


పశ్చిమ బెంగాల్, కేరళ రెండూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాలే అన్నారు. మహారాష్ట్రలో హిందువులు, మరాఠీలు, మరాఠీయేతరులను విభజించాలని బీజేపీ కుట్ర చేస్తోందని థాకరే ఆరోపించారు. సమీప భవిష్యత్తులో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను సందర్శించాలని థాకరే తన సంకల్పాన్ని కూడా వ్యక్తం చేశారని ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.

Updated Date - 2022-05-01T01:02:32+05:30 IST