BJP: ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు వద్దు

ABN , First Publish Date - 2022-08-20T18:01:40+05:30 IST

ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు బీజేపీ(BJP) అధిష్టానం చెక్‌ పెట్టింది. ఇటీవల కొందరు పార్టీ నేతలు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతోపాటు

BJP: ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు వద్దు

                                   - పార్టీ నేతలకు బీజేపీ అధిష్టానం హెచ్చరిక 

      

బెంగళూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వంపై బహిరంగ విమర్శలకు బీజేపీ(BJP) అధిష్టానం చెక్‌ పెట్టింది. ఇటీవల కొందరు పార్టీ నేతలు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైతోపాటు ప్రభుత్వంపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో అధిష్టానం తీవ్రంగా భావించింది. పార్టీ పదవుల్లో కొనసాగేవారెవ్వరూ బహిరంగ సభలు, సమావేశాల్లో తీవ్రమైన వ్యాఖ్యలు చేయరాదని ఆదేశించింది. ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పదవుల్లో ఉండేవారే అనుచితంగా ప్రవర్తించరాదని హెచ్చరించింది. న్యాయ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి మాధుస్వామి(Minister Madhuswamy) ఇటీవల ప్రభుత్వం అభివృద్ధి దిశగా లేదని మేనేజ్‌ చేస్తున్నామని వ్యాఖ్యానించడాన్ని తీవ్రం గా భావించింది. మంత్రులు ఎస్‌టీ సోమశేఖర్‌, మునిరత్న బహిరంగ విమర్శలు చేయడాన్ని తప్పుబట్టింది. సమస్య ఏదైనా నాయకుల సమక్షంలో చర్చించుకోవాలని, బహిరంగ సభల దాకా వెళ్లరాదని సూచించింది. 

Updated Date - 2022-08-20T18:01:40+05:30 IST