Abn logo
Oct 28 2020 @ 17:52PM

రాహుల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి బీజేపీ లేఖ

Kaakateeya

న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి  లేఖ రాసింది. ‘‘నిరుద్యోగులకు, రైతులకు తగిన న్యాయం జరగాలంటే మహాఘట్ బంధన్‌కు ఓటు వేయండి’’ అని పోలింగ్ సమయంలో రాహుల్ ట్వీట్ చేశారని బీజేపీ పేర్కొంది. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకే ఆయనపై చర్యలు తీసుకోవాలని తాము ఈసీని కోరినట్లు బీజేపీ ఓ ప్రకటనలో తెలిపింది. 

రాహుల్ గాంధీ ఏం ట్వీట్ చేశారంటే...

‘‘రైతులకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే మహాఘట్ బంధన్‌కు ఓటు వేయాలి. మొదటి దశ పోలింగ్ ఎన్నికల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. 

Advertisement
Advertisement