Abn logo
Dec 6 2020 @ 00:16AM

కుటుంబ పాలనతో కుంటుపడిన అభివృద్ధి

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

ఇరగవరం, డిసెంబరు 5: రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబు నాయుడుల కుటుంబ పాలనతో అభివృద్ధి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఇరగవరంలో జరిగిన బీజేపీ శ్రేణుల వన సమారాధనలో వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌లను ఇచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన దానికంటే ఎక్కువ స్థానాలను సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీతో కలిసి ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ, నర్సాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీ, ఇరగవరం మండల అధ్యక్షుడు మేకా చంద్రమౌళి, అయినంపూడి శ్రీదేవి, వల్లూరి ఝాన్సీరాణి, కొవ్వూరి వెంకటరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement