ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ

ABN , First Publish Date - 2021-10-20T17:29:35+05:30 IST

మహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేసి ఊరేగింపులకు స్వాగతం

ఘనంగా మిలాద్‌-ఉన్‌-నబీ

హైదరాబాద్/ఎల్‌బీనగర్‌ : మహమ్మద్‌ ప్రవక్త పుట్టిన రోజును పురస్కరించుకుని ముస్లింలు మిలాద్‌ ఉన్‌ నబీ వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ప్రత్యేక స్వాగత వేదికలను ఏర్పాటు చేసి ఊరేగింపులకు స్వాగతం పలికారు. సరూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ సరూర్‌నగర్‌ డివిజన్‌ మైనారిటీ సెల్‌ నాయకులు సలీం, కరీం, హైదర్‌, మహబూబ్‌, సుభాన్‌ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై  నుంచి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, సరూర్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సీతారాం, సరూర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆకుల అరవింద్‌ తదితరులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పోలె అరవింద్‌, పుట్టం విజేందర్‌, సిలివేరు వెంకటే్‌షగౌడ్‌, కట్ట ప్రవీణ్‌, మల్లే్‌షగౌడ్‌, బాలరాజ్‌గౌడ్‌, రాజు, కుర్మాతి లక్ష్మణ్‌, అభిలాష్‌, యశ్వంత్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, మొగిళ్ల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.


సంతో్‌షనగర్‌ డివిజన్‌ పరిధిలో మహ్మద్‌ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని ముస్లింలు పెద్దసంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు. యువకులు ద్విచక్రవాహనాల పై జెండాలను ఏర్పాటు చేసుకొని ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ర్యాలీలకు స్వాగత వేదికలు ఏర్పాటు చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. సంతో్‌షనగర్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


వివాదానికి దారితీసిన ఫ్లెక్సీ

సరూర్‌నగర్‌లో స్వాగత వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. ఫ్లెక్సీపై బంగ్లాదేశ్‌ యూత్‌ మిలాద్‌ ఉన్‌ నబీ ముబారక్‌ అని ఉండటం, ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం కాస్త పోలీసుల వరకు చేరింది. పోలీసులు అక్కడికి చేరుకుని దానిని సరిచేయాలని నిర్వాహకులకు సూచించారు.


మిఠాయిల పంపిణీ

చార్మినార్‌ ఆక్టోబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): మిలాద్‌ ఉన్‌ నబీ ఊరేగింపులో చార్మినార్‌ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద మాజీ కారొరేటర్‌ మహ్మద్‌ గౌస్‌ ప్రజలకు మిఠాయిలు, ఐస్‌ క్రీం, తదితర ఆహార పదార్థాలు పంచిపెట్టారు. 


జల్‌పల్లి మున్సిపాలిటీలో..

మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినం సందర్భంగా జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జల్‌పల్లి, పహాడిషరీఫ్‌, షాహీన్‌నగర్‌, ఎర్రకుంట, కొత్తపేట్‌, వాదియే హుదా తదితర బస్తీల్లోని ప్రధాన రహదారులపై ఆకుపచ్చ తోరణాలను అలంకరించారు. బస్తీల్లో ఫజర్‌ నమాజ్‌ అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మసీదుల్లో మత పెద్దలు మహ్మద్‌ ప్రవక్త జీవిత విశేషాలపై ప్రసంగించారు. జల్‌పల్లిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులు షాహీన్‌నగర్‌ నుంచి పహాడిషరీఫ్‌ దర్గా వరకు ర్యాలీగా వెళ్లారు. అక్కడి నుంచి కొంత మంది యువకులు పాతబస్తీలోని ప్రధాన ర్యాలీకి బయలు దేరారు. కార్యక్రమంలో షేక్‌ జహంగీరుద్దీన్‌, షేక్‌ జహీరుద్దీన్‌, షేక్‌ అఫ్జల్‌, షాకీర్‌, అంజద్‌ ఖాన్‌, సూరెడ్డి కృష్ణారెడ్డి, ఖైసర్‌ బామ్‌ సమద్‌ రౌఫ్‌ ఇక్బాల్‌ ఖలీఫా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T17:29:35+05:30 IST