Bits Pilaniలో పీజీ కోర్సులు

ABN , First Publish Date - 2022-08-15T20:46:26+05:30 IST

పిలానీ(Pilani)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(Birla Institute of Technology and Science)(బిట్స్‌) - వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌(Working professionals) కోసం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులు

Bits Pilaniలో పీజీ కోర్సులు

పిలానీ(Pilani)లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌(Birla Institute of Technology and Science)(బిట్స్‌) - వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌(Working professionals) కోసం పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. కనీసం ఏడాది అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కెరీర్‌ బ్రేక్‌ లేకుండా కోర్సులు కొనసాగించే వీలుంటుంది. వారాంతాల్లో లైవ్‌ ఆన్‌లైన్‌ సెషన్స్‌, మిగిలిన రోజుల్లో ఆఫీసు వేళల తరవాత ఆన్‌లైన్‌ లెక్చర్స్‌ ఉంటాయి. డౌట్‌ క్లియరింగ్‌ సెషన్స్‌, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌, ఇండస్ట్రీ టాక్స్‌, ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తారు. ఫైనల్‌ సెమిస్టర్‌లో డిజర్టేషన్‌(ప్రాజెక్ట్‌ వర్క్‌) ఉంటుంది. ప్రతి సెమిస్టర్‌లో మిడ్‌, కాంప్రహెన్సివ్‌ పరీక్షలు ఉంటాయి. వీటిని ఆన్‌లైన్‌ ద్వారా లేదా ఎంచుకొన్న పరీక్ష కేంద్రానికి వెళ్లి రాయవచ్చు. 


ఎంటెక్‌ డేటా సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు సెమిస్టర్లు. డేటా సైంటిస్టులు, డేటా ఇంజనీర్లుగా రాణించేందుకు అవసరమైన మేథమెటికల్‌, ఇంజనీరింగ్‌ స్కిల్స్‌ పెంపొందించేలా కోర్సుని రూపొందించారు. మేథమెటికల్‌ ఫౌండేషన్‌ ఫర్‌ డేటా సైన్స్‌, స్టాటిస్టికల్‌ మెథడ్స్‌, డేటా స్ట్రక్చర్స్‌ అండ్‌ అల్గారిథమ్స్‌ డిజైన్‌, సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌, డేటా మైనింగ్‌, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా విజువలైజేషన్‌ అండ్‌ ఇంట్రప్రిటేషన్‌, ఎథిక్స్‌ ఫర్‌ డేటా సైన్స్‌, డీప్‌ లెర్నింగ్‌, ఆర్టిఫీషియల్‌ అండ్‌ కంప్యూటేషనల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా వేర్‌హౌసింగ్‌, ప్రాసెసింగ్‌ ఆఫ్‌ అనలిటిక్స్‌ తదితర అంశాలు వివరిస్తారు. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. బేసిక్‌ ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్‌, మేథమెటిక్స్‌లో ప్రావీణ్యం తప్పనిసరి.

దరఖాస్తు ఫీజు: రూ.1500


ఎంటెక్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగు సెమిస్టర్లు. మెషిన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్లు, ఏఐ సైంటిస్ట్లుగా రాణించేందుకు ఈ ప్రోగ్రామ్‌ ఉపకరిస్తుంది. ఇందులో అడ్వాన్స్‌డ్‌ డీప్‌ లెర్నింగ్‌, కంప్యూటేషనల్‌ లెర్నింగ్‌, స్పీచ్‌ ప్రాసెసింగ్‌, నేచురల్‌ లాంగ్వేజ్‌ ప్రాసెసింగ్‌, టూల్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ సంబంధిత అంశాలు వివరిస్తారు.    

అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణులు; మేథమెటిక్స్‌ ఒక సబ్జెక్ట్‌గా ఎమ్మెస్సీ/ తత్సమాన కోర్సు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మేథమెటిక్స్‌లో ప్రావీణ్యం, ప్రోగ్రామింగ్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. 

దరఖాస్తు ఫీజు: రూ.1500


పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఫుల్‌ స్టేక్‌ ఇంజనీరింగ్‌

ఈ ప్రోగ్రామ్‌ వ్యవధి 11 నెలలు. ఇందులో సాఫ్ట్‌వేర్‌ డెవల్‌పమెంట్‌ లైఫ్‌ సైకిల్‌, డెవాప్స్‌, అప్లికేషన్స్‌ డెవల్‌పమెంట్‌ ఫర్‌ వెబ్‌, మొబైల్‌ అండ్‌ క్లౌడ్‌, టూల్స్‌ అండ్‌ టెక్నాలజీస్‌ తదితర అంశాలు బోధిస్తారు. ఎనిమిది వారాల క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ కూడా ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్లు, క్వాలిటీ అస్యూరెన్స్‌ ప్రొఫెషనల్స్‌, డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్లు, సపోర్ట్‌/ మెయింటెనెన్స్‌ ప్రొఫెషనల్స్‌కు ఈ ప్రోగ్రామ్‌ ఉపయుక్తంగా ఉంటుంది.  

అర్హత: బీఈ/ బీటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ/ ఇంటిగ్రేటెడ్‌ ఫస్ట్‌ డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు.


పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి 11 నెలలు. ఇందులో ఆరు వారాల క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ ఉంటుంది. ఐఓటీ టెక్నాలజీ, సైబర్‌ - ఫిజికల్‌ సిస్టమ్స్‌, ఐఓటీ అప్లికేషన్స్‌, క్లౌడ్‌ సర్వీసెస్‌, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, అప్లికేషన్‌ సిస్టమ్స్‌, బిగ్‌ డేటా, ఇంటర్‌ప్లే ఆఫ్‌ ఐఓటీ సిస్టమ్స్‌ తదితర అంశాలపై శిక్షణ ఉంటుంది. 

అర్హత: బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌) అభ్యర్థులు, ఎమ్మెస్సీ (ఎలక్ట్రానిక్స్‌) ఉత్తీర్ణులు అప్లయ్‌ చేసుకోవచ్చు.




పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌

ప్రోగ్రామ్‌ వ్యవధి 11 నెలలు. ఇందులో  రిగ్రెషన్‌, ఫీచర్‌ ఇంజనీరింగ్‌, క్లాసిఫికేషన్‌, అన్‌ సూపర్‌వైజ్డ్‌ లెర్నింగ్‌ అండ్‌ అసోసియేషన్‌ రూల్‌ మైనింగ్‌, టెక్స్ట్‌ మైనింగ్‌, డీప్‌ లెర్నింగ్‌ అండ్‌ ఏఎన్‌ఎన్‌ తదితర అంశాలు బోధిస్తారు. డేటాసైన్స్‌ - బిజినెస్‌ ప్రాబ్లమ్స్‌ అంశానికి సంబంధించి ఎనిమిది వారాల క్యాప్‌స్టోన్‌ ప్రాజెక్ట్‌ కూడా ఉంటుంది. 

అర్హత: బీఈ/ బీటెక్‌ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ(మేథమెటిక్స్‌/స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణులు కూడా అప్లయ్‌ చేసుకోవచ్చు. పైథాన్‌ లాంగ్వేజ్‌లో పరిజ్ఞానం తప్పనిసరి.


ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 12

వెబ్‌సైట్‌: https://bits-pilani-wilp.ac.in/

Updated Date - 2022-08-15T20:46:26+05:30 IST