బయోమెట్రిక్ తంటా
ABN , First Publish Date - 2022-02-13T06:16:15+05:30 IST
ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజ రు తలనొప్పిగా మారింది. యంత్రాలకు సాంకేతిక సమస్యలు వెంటాడుతుండటంతో తంటా లు పడుతున్నారు.
సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్న యంత్రాలు
ఉపాధ్యాయులకు తప్పని అవస్థలు
ఉరవకొండ, ఫిబ్రవరి 12: ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు బయోమెట్రిక్ హాజ రు తలనొప్పిగా మారింది. యంత్రాలకు సాంకేతిక సమస్యలు వెంటాడుతుండటంతో తంటా లు పడుతున్నారు. కరోనా ప్రభావంతో పాఠశాలల్లో నిలిపేసిన బయోమెట్రిక్ విధానాన్ని ప్ర స్తుతం కొనసాగించనున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు బుధవారం నుంచి బయోమెట్రిక్ హాజరు వేయాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఈనేపథ్యంలో మూలనపడిన బయోమెట్రిక్ యంత్రాల కు బూజు దులుపుతున్నారు.
54 పాఠశాలల్లో మూలనపడిన యంత్రాలు
మండలంలో 66 ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12 పాఠశాలల్లో మాత్రమే బయోమెట్రిక్ పరికరాలు ప నిచేస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలకు ఒకటి, ఉన్నత పాఠశాలలకు రెండు యంత్రాలను ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయిలో ఇంటర్‌నెట్ పని చేయకపోవ డం, వేలిముద్రలు సరిగా పడకపోవడం వంటి సమస్యలతో ఉపాధ్యాయులు ఇ బ్బంది పడ్డారు. సుమారు రెండేళ్లకు పైగా ఈ యంత్రాలు వినియోగించలేదు. చాలా చోట్ల పాఠశాలల్లో బ్యాటరీలు పాడైపోయాయి. కొన్ని పాఠశాలల్లో ఈ యంత్రాలు మూలనపడ్డాయి.వివరాలను విద్యాశాఖాధికారులు సేకరిస్తున్నారు.
నిరసన గళమెత్తకుండా వుండేందుకేనా..?
తాజాగా పీఆర్సీలో అన్యాయం జరిగిందని ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. నిరవధిక సమ్మె చేయాలని భావించారు. పీఆర్సీ సాధన సమితి, మంత్రుల కమిటీ మధ్య జరిగిన చర్చలతో సమ్మె విరమించారు. ఉపాధ్యాయ సంఘాలు మాత్రం ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించాయి. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరవుతున్నారు. ఉద్యమ ఉ ధృతికి సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచి పాఠశాలలకు పరిమితం చేయడానికి బయోమెట్రిక్ హాజరును తెరపైకి తెచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు భావిస్తున్నాయి.
వివరాలు సేకరిస్తున్నాం : ఈశ్వరయ్య, ఎంఈవో
భవిష్యత్తులో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అవుతోంది. మండలంలో 66 పాఠశాలలో ఉండగా, 54 పాఠశాలల్లో యంత్రాలు పని చేయడం లేదు. పని చే యని యంత్రాలు ఎన్ని? నెట్‌వర్క్‌లేని ప్రాంతాల వివరాలను సేకరిస్తున్నాం. నివేదికను జిల్లా విద్యాశాఖాధికారులకు పంపుతాం.
అవస్థలు పడుతున్నాం : సాకే భాస్కర్, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు
బయోమెట్రిక్ యంత్రాలు, డివైజర్లు సక్రమంగా పనిచేయక అవస్థలు పడుతున్నాం. బయోమెట్రిక్ హాజరువిధానానికి వ్యతిరేకం కాదు. హాజరు కోసమే గం టల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. కరోనా సమయంలో యంత్రాలను పక్కన పెట్టేశారు. అవన్నీ చెడిపోవడమే కాకుండా సిమ్‌కార్డులు బ్లాక్ అయ్యాయి. నాణ్యమైన యంత్రాలను సరఫరా చేయాలి.